అల్జీరియాలో సైనిక నియంత అహ్మద్ గైద్ సలాహ్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు 12వ వారానికి చేరుకున్నాయి. ముస్లింల పవిత్రమాసం రంజాన్లోనూ... రాజధాని అల్జీర్స్తో పాటు మిగతా పట్టణాల్లోనూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.
సైనికాధ్యక్షుడు అహ్మద్ సలాహ్ గద్దె దిగాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దేశానికి పౌర ప్రభుత్వమే తప్ప నియంత పాలన వద్దంటూ నినాదాలు చేశారు.
దేశాధ్యక్షుడు అబ్దెలజీజ్ బౌటేఫ్లికాకు వ్యతిరేకంగా ప్రజలు ఫిబ్రవరి 22న నిరసన ఉద్యమం చేపట్టారు. ఫలితంగా ఆయన ఏప్రిల్ 22న తన పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన ఆర్మీ చీఫ్ అహ్మద్ సలాహ్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు. ఫలితంగా దేశంలో ప్రజాస్వామ్య, గణతంత్ర పాలన కోసం మరోమారు నిరసనలు చెలరేగాయి.
ఇదీ చూడండి: బ్లూ మూన్: చంద్రయాన్ రేస్‌లో అమెజాన్