సోమాలియాలో ఉగ్రమూకలు దారుణానికి ఒడిగట్టారు. అల్ ఖైదా అనుబంధ సంస్థ అల్ షబాబ్ గ్రూపు ఉగ్రవాదులు... దక్షిణ సోమాలియా ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది వైద్యులను అపహరించి, అతికిరాతకంగా చంపేశారు. మధ్య షాబెల్లీ ప్రావిన్సు బలాద్ నగర సమీపంలో వైద్యుల మృతదేహాలు లభ్యమవ్వడం ఆందోళనకు గురి చేస్తుంది.
ఆ వైద్యులందరూ యువకులని, స్థానిక ఆస్పత్రుల్లో పనిచేసే వారని అధికారులు తెలిపారు. సోమాలియాలో 1990 నుంచి ఉగ్రవాదులు హింసను సృష్టిస్తున్నారు.
ఇదీ చూడండి: ట్రంప్ వర్సెస్ ట్విట్టర్ : కీలక ఉత్తర్వులకు అధ్యక్షుడు ఓకే