సెంట్రల్ ఆఫ్రికాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన ఈ దుర్ఘటనలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సమయంలో పడవలో 700 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నట్లు అక్కడి మంత్రి స్టీవ్ ఎంబికాయి వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపిన ఆయన... ఇప్పటివరకు 60 మృతదేహాలను వెలికి తీసినట్లు పేర్కొన్నారు. మరో 300 మందిని రెస్క్యూ బృందాలు కాపాడినట్లు వెల్లడించారు. ఇంకా కొంత మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.
కిన్షాసా ప్రాంతం నుంచి బయలుదేరిన పడవ.. ఈక్విటార్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. పడవ మునిగిపోవడానికి ఓవర్లోడ్ ప్రధాన కారణమని భావిస్తున్నారు.