ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా చెలరేగిన మంటలను అదుపు చేసే క్రమంలో 25 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 17 మంది పౌరులు సైతం మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.
కెబైల్లోని రెండు ప్రాంతాల్లో మంటలు తీవ్రంగా వ్యాపించాయని, సైనికులు సహాయ చర్యలు చేపట్టి 100 మందికిపైగా రక్షించారని అధికారులు స్పష్టం చేశారు. పౌరులతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 42కు చేరిందని వివరించారు
ఇదీ చదవండి:రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చు- భారీగా ఆస్తినష్టం