ఈజిప్టు అసియుట్ రాష్ట్రంలో బస్సు, ట్రక్కు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మంది మరణించారు. మరో ముగ్గురు క్షతగాత్రులయ్యారు.
కైరో నుంచి 320 కిలోమీటర్లు ప్రయాణించిన బస్సు.. అసియుట్ రాష్ట్రంలోకి ప్రవేశించిన కొద్ది సేపటికే ట్రక్కుని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించే సమయంలో బోల్తా పడింది. వేగంగా ఉన్న ట్రక్కు, బోల్తా పడిన బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి.
సమాచారం అందుకున్న అధికారులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: పాఠశాలలో కాల్పుల కలకలం - ఒకరు మృతి