ETV Bharat / headlines

వీరుడికి ఘనస్వాగతం

పాకిస్థాన్​ సైన్యం చెరబట్టిన భారత వాయుసేన వింగ్​ కమాండర్ అభినందన్​​ సగర్వంగా స్వదేశంలో అడుగుపెట్టారు. వాఘా సరిహద్దులో వేయి కళ్లతో వేచి చూసిన భారతీయుల ఆశలు ఫలించాయి. వాయుసేన యోధుడికి భారత సైనిక బలగాలు, వాయుసేన అధికారులు ఘన స్వాగతం పలికారు.

వీరుడికి ఘనస్వాగతం
author img

By

Published : Mar 1, 2019, 6:41 PM IST

Updated : Mar 1, 2019, 9:53 PM IST

భారతీయులు ఎంతగానో ఎదురు చూసిన వింగ్​ కమాండర్​ అభినందన్​ దేశానికి తిరిగొచ్చారు. ఈ భారత పైలట్​కు వాఘా సరిహద్దు వద్ద వైమానికదళం ఘనస్వాగతం పలికింది. అనంతరం వింగ్​ కమాండర్​ను అధికారులు దిల్లీ తీసుకెళ్లారు.

అభినందన్​ అప్పగింత సందర్భంగా అటారి-వాఘా సరిహద్దు వద్ద బీటింగ్​ రిట్రీట్​ను నిలిపివేశారు.

ఇలా వచ్చారు...

పాక్​ అధికారులు అభినందన్​ను లాహోర్​ నుంచి ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య అటారి-వాఘా సరిహద్దుకు తరలించారు. అక్కడ పాక్​ వైపు అన్ని ప్రక్రియలను పూర్తిచేసుకున్న అభినందన్ భారత్​లోకి అడుగుపెట్టారు.

ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం ముందుగానే అంబులెన్స్​ను సిద్ధంగా ఉంచారు. చాలా సేపటి వరకు అభినందన్​ను వాఘా సరిహద్దు నుంచి బయటకు తీసుకురాలేదు.

ఎంతో సేపు భారత పైలట్​ విడుదలపై ఉత్కంఠ కొనసాగింది. రెండు సార్లు అప్పగింత సమయాన్ని మార్చింది పాక్​. చివరకు 9 గంటలకు భారత్​లో అడుగుపెట్టారు వింగ్​ కమాండర్​ అభినందన్​.

భారతీయుల ఎదురుచూపులు...

అభినందన్​ రాక కోసం వాఘా సరిహద్దులో భారతీయులు గంటల తరబడి వేచిచూశారు. తమ హీరో తిరిగొచ్చాడంటూ సంబరాలు జరుపుకున్నారు. ఆనందంతో నృత్యాలు చేశారు. భారత జాతీయజెండాను పట్టుకొని తమ దేశభక్తిని చాటుకున్నారు. 'భారత్​ మాతాకీ జై' నినాదాలతో ఆ ప్రాంగణం హోరెత్తింది.

దేశమంతటా సందడి వాతావరణం నెలకొంది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ప్రజలు కేక్​లు కట్​ చేసి ఆనందంతో చిందులేశారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ కళాకారుడు అభినందన్​ చిత్రాన్ని చిన్న వేరుశెనగపై గీసి తన దేశభక్తిని చాటుకున్నాడు. వింగ్​ కమాండర్​ను కలిసి దానిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాడు.

undefined

అభినందన్​ను పలు రాజకీయ ప్రముఖులు అభినందించారు. వింగ్​ కమాండర్​ను చూసి దేశం గర్విస్తోందని తెలిపారు.

ఏం జరిగింది..?

పుల్వామా దాడిలో 40 మంది వీర జవాన్ల మృతికి కారణమైన 'జైషే మహ్మద్‌' తీవ్రవాద సంస్థ శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ చర్యకు పాక్‌ స్పందించింది. ఎఫ్​-16 యుద్ధవిమానాలతో భారత సైనిక శిబిరాలపై దాడులకు యత్నించింది.

పాక్‌ యుద్ధవిమానాలను రాడార్‌ల ద్వారా ముందే గుర్తించిన భారత వాయుసేన ఎదురుదాడికి దిగింది. పాకిస్థాన్‌ ఎఫ్​-16 యుద్ధవిమానాన్ని, మిగ్‌-21 యుద్ధవిమానంతో వింగ్‌ కమాండర్‌ అభినందన్ పేల్చేశారు. పాక్‌ దాడిలో అభినందన్‌ ఉన్న మిగ్‌ 21 విమానం కూలిపోయింది. కూలిపోతున్న సమయంలో అభినందన్‌ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పారాషూట్​ సాయంతో పాక్‌ భూభాగంలోకి దూకేశారు. అతడిని పట్టుకున్న పాక్‌ భారత్‌పై ఒత్తిడి పెంచే యత్నం చేసింది.

తిప్పికొట్టిన భారత్​...

అభినందన్‌ను విడిపించుకునేందుకు కేంద్రం దౌత్య మార్గాలపై దృష్టి పెట్టింది. అమెరికా ద్వారా ఇమ్రాన్‌ ఖాన్ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చింది. భారత్‌లోని సౌదీ రాయబారి ప్రధాని నరేంద్రమోదీతో చర్చలు జరిపారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా విదేశాంగ మంత్రి సహా ఆ దేశ ఎన్​ఎస్​ఏతో నేరుగా చర్చలు జరిపారు.

విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అరబ్‌ దేశాల నేతలతో చర్చలు జరిపి పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. అన్ని మార్గాల్లో పాక్‌పై ఒత్తిడి పెంచిన భారత్‌ బేషరతుగా అభినందన్‌ను స్వదేశానికి పంపేలా శక్తి యుక్తులు చూపింది.

undefined

భారత్​దే గెలుపు...

అభినందన్‌ తమ చేతిలో బందీగా ఉన్నాడనే ధీమాతో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చర్చల ప్రస్తావన తెచ్చారు. భారత్ మాత్రం పాక్‌ ఎత్తుగడలను దౌత్యపరంగా తిప్పికొట్టింది. అభినందన్‌ విడుదల విషయంలో ఎలాంటి షరతులు పెట్టడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఉగ్రవాదులపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని కుండబద్దలు కొట్టింది.

భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు పాక్‌ వేసిన ఎత్తుగడ పారలేదు. ప్రపంచ దేశాల ఒత్తిడికి ఇమ్రాన్ ఖాన్‌ వెనక్కి తగ్గక తప్పలేదు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు ఆయన పాక్‌ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రకటించారు.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1200
VIENNA_ Elle Macpherson announced as this year's celebrity guest for the Vienna Opera Ball at a press conference.
1400
LONDON_ Exclusive behind the scenes at a very Royal photoshoot.
2100
LONDON_ European premiere of 'Captain Marvel' takes place.
2300
SANTA MONICA_ With the Oscars marking a record-breaking year for female winners, what will it take to get Hollywood to surpass the 4 percent challenge?
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_  Author Matt Haig and musician Andy Burrows discuss the music that cheers them up
NEW YORK_ Celebrities including Mindy Kaling and Kate Hudson dish on their fashion inspirations.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
ARCHIVE_ Alejandro Gonzalez Inarritu to be the 2019 Cannes jury president.
ARCHIVE_ R. Kelly insiders may have helped R&B star with sexual abuse.
LOS ANGELES_ Spanish rock band Mana announce new U.S. tour, 'Rayando el Sol.'
LOS ANGELES_ Chloe Grace Moritz brings her Toronto festival favorite, tale of fatal attraction, to L.A..
LOS ANGELES_ Items from last three 'Transformers' films go on auction.
OBIT_ Clark Gable III, grandson of acting great, dies in Dallas at age 30.
NEW YORK_ Tyler Perry readies to say goodbye to Madea, plans to 'go somewhere, smoke a joint and relax and lay down because I'm tired.'
ARCHIVE_ Billy Porter speaks on Oscar gown and social media hate.
PARIS_ Anrealage delivers big; blown up details, experimentation and social commentary key to fall/winter collection.
PARIS_ Jennifer Lawrence, Karlie Kloss and Natalia Vodianova arrive for Dior.
PARIS_ Dior shows off its Fall/Winter ready-to-wear collection in Paris.
Last Updated : Mar 1, 2019, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.