ప్రధాన మంత్రి సోదరుడు, ప్రధాన మంత్రి జన కల్యాణ్ యోజన అభియాన్ అధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ హైదరాబాద్ ముషీబాద్లోని భోలక్పూర్ డివిజన్లో పర్యటించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి చెల్లించే పన్నుల కన్నా 25% ఎక్కువగానే తీసుకుంటారని చెప్పారు. తెరాస పట్ల ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని.. వారంతా భాజపా వైపు చూస్తున్నారని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. ప్రజలందరూ ఓటు వేయాలని కోరారు.
ఇదీ చదవండి: అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేయండి: సీఎం కేసీఆర్