గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి టోల్కట్ట ప్రేమ్‌దాస్‌గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ప్రచారం సందర్భంగా ప్రజలు తనతో చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి జరగాలంటే తెరాసకే ఓటు వేయాలని స్థానిక ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. బస్తీలకు వెళ్లినప్పుడు ఎక్కడ చూసినా మురికి నీళ్లు, మురికి కాలువలు దర్శనమిస్తున్నాయని, సరైన వ్యవస్థ లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే బస్తీల అభివృద్ధికై చిత్తశుద్ధితో కృషి చేస్తానని ప్రేమ్‌దాస్‌గౌడ్ హామీనిచ్చాారు.
గెలిపిస్తే బస్తీలను అభివృద్ధి చేస్తా : తెరాస అభ్యర్థి ప్రేమ్‌దాస్ గౌడ్ - telangana news
ప్రస్తుత కార్పొరేటర్ నిర్లక్ష్యం వల్ల మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బస్తీలు అభివృద్ధికి దూరమయ్యాయని తెరాస అభ్యర్థి టోల్కట్ట ప్రేమ్‌దాస్ గౌడ్ ఆరోపించారు. తనను గెలిపిస్తే బస్తీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని స్థానికులకు హామీ ఇస్తున్నారు.