ETV Bharat / ghmc-2020

ప్రచారంలో మరింత దూకుడు పెంచిన భాజపా - అమిత్​ షా జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం వార్తలు

నేటితో జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుండటంతో... భాజపా మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే నగరంలోని అన్ని డివిజన్ల పరిధిలో అగ్రనేతలు విస్తృతంగా పర్యటిస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అధికార పక్షంపై ఎదుదాడి చేస్తూ.. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి నేడు అమిత్‌షా.. హైదరాబాద్‌ రానున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం సందర్శన సహా.. రోడ్‌ షో పాల్గొని పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపనున్నారు.

central home minister amith sha tour in hyderabad
ప్రచారంలో మరింత దూకుడు పెంచిన భాజపా
author img

By

Published : Nov 29, 2020, 4:54 AM IST

ప్రచారంలో మరింత దూకుడు పెంచిన భాజపా

బల్దియా ఎన్నికల పోరులో ఆఖరి ఘట్టం సమీపించింది. నేటితో ప్రచారానికి తెర పడనుంది. దీంతో ప్రచార క్షేత్రంలో కమలనాథులు దూకుడు పెంచారు. అన్ని డివిజన్లలో విస్తృత పర్యటన చేస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భాజపాను గెలిపించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు. బంజారాహిల్స్ డివిజన్‌లో బద్దం మహిపాల్ రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడిగారు. దుబ్బాక ఎన్నికల తర్వాత భాజపా శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని.. అదే స్పూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నం చేస్తున్నామని భాజపా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు

తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాంపల్లిలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో... ఆయన పాల్గొన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస.. హామీలతో 99సీట్లు సాధించుకుందని... కానీ అయిదేళ్లు పూర్తైనా చేసిందేమీ లేదన్నారు. భారతీనగర్‌ రోడ్‌ షోలో ఎంపీ అర్వింద్‌ పాల్గొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభ్యర్థులకు మద్దతుగా.. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బేగంపేట్‌, రాంగోపాల్‌పేట్‌, అడిక్మెట్‌, గాంధీనగర్ , బోజగుట్ట లో... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటికే పరిమితమై... ఎన్నికలు అనే సరికి ఓట్లు అడిగేందుకు ఎల్‌బీ స్టేడియం వచ్చారని కిషన్‌రెడ్డి విమర్శించారు.

గడీలు బద్దలు కొట్టే సత్తా భాజపాకే ఉంది

మన్సురాబాద్ డివిజన్ భాజపా అభ్యర్థి కోప్పుల నరసింహారెడ్డి... కాలనీలలో తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దుబ్బాకలో వచ్చిన ఫలితాలు... జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నూ రావాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తార్నాక డివిజన్ భాజపా అభ్యర్థి బండ జయసుధకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ గడీలా రాజ్యాన్ని బద్దలు కొట్టే సత్తా... భాజపాకే ఉందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌడ సమ్మేళనానికి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌తో కలిసి లక్ష్మణ్ ముఖ్య అథిగా పాల్గొన్నారు. తెరాస పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతోందని అయన ఆరోపించారు.

చివరి రోజు అమిత్​ షా ప్రచారం

బల్దియా ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో... భాజపా రాష్ట్ర నాయకత్వం అమిత్ షాను రప్పిస్తోంది. ఆఖరి రోజు అమిత్ షా ప్రచారం మంచి ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 10 గంటల 15నిమిషాలకు రోడ్డు మార్గం ద్వారా భాగ్యలక్ష్మీ దేవాలయానికి అమిత్‌ షా వెళ్లనున్నారు. అనంతరం రోడ్డు షోలో పాల్గొనేందుకు వారసిగూడాకు బయలుదేరి వెళ్తారు. హనుమాన్ దేవాలయం మీదుగా సీతాఫల్ మండి వరకు రోడ్డు షోలో పాల్గొంటారు. ఆ తర్వాత నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రాష్ట్ర నాయకత్వంతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి దిల్లీకి తిరుగు ప్రయాణంకానున్నారు..

ఇదీ చదవండి: తెరాస కార్యకర్తల కోసమే నగదు రూపంలో వరద సాయం: యోగి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.