Jabardasth Varsha: 'జబర్దస్త్' వేదికపై నటించే జోడీలకు బయట ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి జోడీల్లో ఒకటి ఇమ్మాన్యుయెల్- వర్ష. ఎన్నో ఎపిసోడ్స్, స్పెషల్ షోస్‌లో వీళ్లిద్దరి రొమాంటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. పైగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఊహాగానాలు బయటకు వచ్చాయి. దానికి తోడు ఓ స్పెషల్ ఈవెంట్లో ఇమ్మాన్యుయెల్- వర్షకు పెళ్లి కూడా చేసేయడం ఊహాగానాలకు మరింత ఊపునిచ్చింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ తెగ వార్తలు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఇమ్మూతో తన అనుబంధంపై వర్ష మాట్లాడింది.
" చెప్పాలంటే అనుకోకుండా నేను ఇమ్మాన్యుయెల్ కలిశాం. కేవలం ఒక్క డైలాగ్ కోసమే ఇమ్మూతో స్కిట్ చేశాను. ఆ తర్వాత మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యాం. అయితే అతడు నాకు కేవలం ఫ్రెండ్ అని చెప్పలేను. అలా అని మా ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటనేది కూడా చెప్పలేను. అంతా బాగుంటే స్కిట్లోనిదే బయట నిజం అవ్వవచ్చు.. ఏదైనా అవ్వొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ మన చేతిలో ఉండదు కదా. అతడికి నాపై చాలా గౌరవం ఉంది. నాకు కూడా అతడంటే చాలా అభిమానం."
- వర్ష, జబర్దస్త్ నటి
"ప్రస్తుతం మా టీమ్‌లో ఉన్న భాస్కర్.. నాకొక టీచర్ లాంటి వారు. తెలుగులో కొన్ని పదాలు నేను సరిగ్గా పలకలేను. వాటిని దగ్గరుండి నాకు నేర్పిస్తారు. నేను, భాస్కర్, ఫైమా, ఇమ్మూ మేమంతా ఒక కుటుంబంలా ఉంటాం. ఏ ఒక్క ఎపిసోడ్కైనా మా నలుగురిలో ఒక్కరు మిస్ అయినా ఆ రోజంతా వారి గురించే మాట్లాడుకుంటాం.
అప్పుడంటే కంటెస్టంట్ల మధ్య పోటీ ఉండేది.. ఇప్పుడు మాత్రం టీమ్‌ల మధ్య గట్టి పోటీ ఉంది. మరింత బాగా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తాం. కొన్ని సార్లు ఎమోషనల్‌గా మాట్లాడతాం. కానీ చాలా మంది అవి టీఆర్పీ కోసమే చేస్తామని అనుకుంటుంటారు. అయితే అన్నీ ఫేక్ కాదు.. అలా అని అన్నీ నిజం కూడా కావు. మల్లెమాల సంస్థ అందరినీ ప్రోత్సహిస్తోంది. నాకైతే ప్రస్తుతం మూవీలు చేయాలని లేదు. ఇంకేదైనా డ్రీమ్ ఉంటే వీరికే చెబుతా.. కానీ ఇంక్కెకడికీ వెళ్లను." అని వర్ష తన మనసులో మాటల్ని చెప్పింది.
ఇవీ చదవండి: భారీ ధరకు నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ వీడియో రైట్స్!
సమంత తగ్గట్లేదుగా.. మళ్లీ అలా - కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో అమీ జాక్సన్