ETV Bharat / entertainment

బిగ్​బాస్​లో సూపర్​ ట్విస్ట్! ఇంటి నుంచి ఆ లేడీ కంటెస్టెంట్ అవుట్! - బిగ్​బాస్​లో సూపర్​ ట్విస్ట్

Bigg Boss 7 Telugu 11th Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఆట అయిపోయేందుకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. షోను మరింత అద్భుతంగా మలుస్తున్నారు బిగ్ బాస్ టీం నిర్వాహకులు. పదో వారంలో ఇంటి నుంచి భోలే షావలి ఎలిమినేట్​ కాగా.. 11వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు మరో లేడి కంటెస్టెంట్​ సిద్ధమైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Bigg Boss_7_Telugu_11th_Week_Elimination

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 2:42 PM IST

Bigg Boss 7 Telugu 11th Week Elimination : బిగ్​బాస్​ సీజన్​ 7 ముగింపు దశకు వచ్చేసరికి.. చిత్ర విచిత్ర సంఘటనలు, టాస్క్​లు, నామినేషన్లు, ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. దీనికి తోడు "​ ఉల్టా పల్టా" నేపథ్యంలో.. ఎలిమినేషన్​ టైం లో జనాలు ఊహించింది ఒకరి పేరైతే.. ఎలిమినేట్ అయ్యేది మరొకరుగా ఉంటున్నారు. మరి.. 11వ వారం ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారో తెలుసా?

నామినేషన్స్​లో ఎవరున్నారంటే..? ఈ సీజన్​లో 11వ వారం నామినేషన్స్​ ప్రక్రియ.. సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు జరిగింది. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు.. ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్​, శోభాశెట్టి, ప్రియాంక, అమర్​దీప్​, అర్జున్​, అశ్విని నామినేట్​ అయ్యారు. శివాజీ కెప్టెన్​ కారణంగా అతను నామినేట్​ కాలేదు.. మరోవైపు ప్రశాంత్​కు ఒక్క ఓటే రావడం వల్ల అతను సేవ్​ అయ్యాడు.

రామ్​చరణ్​ మూవీలో బిగ్​బాస్​ కంటెస్టెంట్​ కీలక పాత్ర- అనౌన్స్​ చేసిన డైరెక్టర్!

ఆమె అవుట్​..! శుక్రవారంతో ఓటింగ్ ముగియడంతో అన్​అఫీషియల్​ పోల్స్​ ప్రకారం.. నామినేషన్స్‌లో ఉన్నవారిలో 34 శాతం ఓట్లతో ప్రిన్స్ యావర్ టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత అమర్ దీప్ 19 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆ తర్వాత వరుసగా రతిక, అశ్విని, ప్రియాంక, అర్జున్, గౌతమ్, శోభా ఉన్నట్లు ఓ అనధికార సర్వే చెబుతోంది. దీంతో ఈ వారం డేంజర్ జోన్‌లో శోభాతో పాటు గౌతమ్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే.. ఓటింగ్​లో చివరగా ఉన్న శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యిందని.. దీనికి సంబంధించిన షూట్ కూడా జరుగుతోందని సోషల్​ మీడియాలో న్యూస్​ వైరల్​ అవుతోంది.

డబుల్​ ట్విస్ట్​ ఉండనుందా..? ఈ సీజన్​లో ఇంకో నాలుగు వారాల ఆట మాత్రమే మిగిలింది. సండే రోజు ఒకరు ఎలిమినేట్​ అయితే.. ఇంకా తొమ్మిదిమంది హౌజ్​లో ఉంటారు. ఆ నాలుగు వారాల్లో ఫినాలే వీక్​ను పక్కకు పెడితే.. మూడు వారాలు మాత్రమే ఉంటుంది. ఎలాగైనా టాప్​ 5 మెంబర్స్​ ఫినాలే వీక్​లో ఉంటారు. కాబట్టి, మూడు వారాలకు సంబంధించి నలుగురు కంటెస్టెంట్​లు ఉంటారు. కాబట్టి.. అందులో ఒక వీక్​లో డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందని సమాచారం. అయితే ఆ డబుల్​ ఎలిమినేషన్​ ఈ వారం లేదా వచ్చే వారంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

బిగ్​బాస్​లో​ నామినేషన్స్ రచ్చ- చేతిపై బాటిల్​ పగలగొట్టుకున్న అశ్విని!

కెప్టెన్​గా ప్రియాంక: ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్’లో ప్రియాంక జైన్ ఆరో ఇంటి కెప్టెన్‌గా నిలిచారు. అంతే కాకుండా ఈ సీజన్‌లో టాప్ 5లో ఎవరు ఉండనున్నారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. అయితే.. ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం ఈ సీజన్‌లో టాప్ ఫైవ్‌లో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్​, ప్రియాంక ఉండబోతున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎవిక్షన్​ పాస్​ సంగతేంటి? : ఈ వారం ఎవిక్షన్​ పాస్​ పొందడానికి బిగ్​బాస్​ పోటీలు నిర్వహించారు. ఈ వారం పెట్టిన పోటీల్లో గెలిచిన యావర్​.. ఎవిక్షన్​ పాస్​ను సొంతం చేసుకున్నాడు. అయితే అతను ఎలిమినేషన్​లో ఉన్నాడు కాబట్టి.. సొంతంగా సేవ్​ చేసుకోవాలని ఫిట్టింగ్​ పెడితే.. యావర్​ తన కోసం ఉపయోగించే అవకాశం ఉంది. అదే వేరే వాళ్ల కోసం అంటే మాత్రం కచ్చితంగా రతికను సేవ్​ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి ఈ వారం ఏం జరుగుతుందో..?

బిగ్​బాస్ బ్యూటీ "శోభా శెట్టి" లవర్ ఇతనా! "కార్తీక దీపం" సీరియల్‌ నుంచే ప్రేమాయణం!!

Siri Hanmanth Latest photos : చీరకట్టులో సిరి అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్​​ రెమ్యునరేషన్​ తీసుకున్న కంటెస్టెంట్​ తెలుసా?

Voice Behind Bigg Boss Season 7 Telugu: బిగ్​బాస్​ హౌస్​లో వినిపించే గొంతు ఎవరిదో కాదు.. ఇతనిదే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.