ETV Bharat / entertainment

త్వరలో సెట్స్​పైకి కొరటాల-ఎన్టీఆర్​ మూవీ.. రిలీజ్​ డేట్ ఫిక్స్.. పోస్టర్ ఊరమాస్! - ntr 30 poster

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొరటాల- ఎన్టీఆర్​ కాంబోపై అప్డేట్ రానే వచ్చింది. మూవీ రిలీజ్ డేట్​ను అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఓ నయా పోస్టర్​ ద్వారా తెలిపింది మూవీ టీమ్​.

ntr 30 poster release
ntr koratala
author img

By

Published : Jan 1, 2023, 12:22 PM IST

యాక్షన్​తో పాటు సెంటిమెంట్​ మూవీస్​కు కేరాఫ్​ అడ్రెస్​ కొరాటల శివ మూవీస్​. ఇప్పటికే ఎంతో మంది స్టార్​ హీరోస్​కు బ్రేక్​ ఇచ్చిన ఈయన తర్వలో యంగ్ టైగర్ ఎన్టీఆర్​తో సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ టాక్​ నెట్టింట హల్​చల్​ చేస్తున్న వేళ సోషల్​ మీడియాలో ఓ పోస్టర్​ విడుదల చేసింది చిత్రబృందం. సినిమా రిలీజ్ డేట్​ను అధికారికంగా ప్రకటించింది.

ntr 30 poster release
ఎన్టీఆర్​ 30 పోస్టర్​

ఆర్​ఆర్​ఆర్​ సినిమా విజయంతో జోష్​ మీద ఉన్న తారక్.. ప్రస్తుతం వెకేషన్​లో ఉన్నారు. అయితే తన అప్​కమింగ్​ మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్​ కోసం న్యూఇయర్​ సందర్భంగా ఓ సరికొత్త సర్ఫ్రైజ్​ను ఇచ్చింది మూవీ టీమ్​. 'ఎన్టీఆర్​ 30' అంటూ ఓ టెంపరరీ టైటిల్​తో రిలీజైన ఆ పోస్టర్​లో ఓ వ్యక్తి తన రెండు చేతుల్లో పదునైన కత్తులు పట్టుకుని నిల్చున్నాడు. ఈ ఫొటో కొంచం క్లోజప్​లో ఉన్నందున ఆ చేతులు ఎవరివో క్లారిటీ లేనప్పటికి ఇవి కచ్చితంగా తమ స్టార్​ హీరోదే అని యంగ్​ టైగర్​ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదే పోస్టర్​లో మరో గుడ్​ న్యూస్​ను అనౌన్స్​ చేసింది చిత్ర యూనిట్​. అదే సినిమా రిలీజ్​ డేట్​. వచ్చే నెలలో సెట్స్​పైకి వెళ్లనున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధం కానుంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత దర్శకుడు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు మూవీ యూనిట్​ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.