ETV Bharat / entertainment

ఒకే సినిమాలో ప్రభాస్, యశ్.. ప్రశాంత్​ నీల్​ డైరెక్షన్​లోనే! - Yash

ప్రభాస్, యశ్.. ఇప్పుడు ట్రెండింగ్​లో పాన్​ ఇండియా స్టార్స్​. ఇప్పుడు ఈ ఇద్దరి సినిమాలకు మామూలు డిమాండ్​ లేదు. ప్రభాస్, యశ్ మూవీస్​ వేరు వేరుగా వస్తేనే.. అభిమానులు థియేటర్లకు క్యూ కట్టేస్తుంటారు. అయితే ఈ ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తే.. దానికి సెన్సేషనల్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​ దర్శకత్వం వహిస్తే?

Yash to make a guest appearance in Prabhas film
ఒకే సినిమాలో ప్రభాస్, యశ్.. ప్రశాంత్​ నీల్​ డైరెక్షన్​లో..!
author img

By

Published : Jul 2, 2022, 3:45 PM IST

దక్షిణాది సినిమాను ఓ రేంజ్​కు తీసుకెళ్లిన హీరోలు ప్రభాస్, యశ్. అయితే బాహుబలితో ప్రభాస్​, కేజీఎఫ్​తో యశ్​ పాన్​ ఇండియా స్టార్స్​గా మారిపోయారు. అయితే వీరిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్​.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్‌'లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో యశ్​ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సలార్​ సినిమాలో.. కీలకమైన అతిథి పాత్ర ఉందట. దీంతో ఆ పాత్రను యశ్​తో చేయించాలని ప్రశాంత్​నీల్​ భావిస్తున్నారట. ఈ క్రమంలో ఆయనకు ఈ పాత్ర గురించి కూడా చెప్పారట ప్రశాంత్​నీల్​. అయితే 'కేజీఎఫ్ 1, 2'తో తనను పాన్​ ఇండియా స్టార్​గా మార్చిన.. ప్రశాంత్ నీల్ అడిగిన ఆ పాత్ర చేసేందుకు యశ్​ ఒప్పుకున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా యశ్​- ప్రభాస్​ కాంబినేషన్​ సీన్లు ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది నిజమే అయితే.. యశ్​- ప్రభాస్ అభిమానులకు పండగనే అని చెప్పాలి. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాంటే.. చిత్ర యూనిట్​ చెప్పేదాకా వేచి ఉండాల్సిందే.. 'సలార్'లో శ్రుతి హాసన్ హీరోయిన్​గా నటిస్తోంది.

ఇదీ చదవండి: Maayon movie: కట్టప్ప తనయుడి చిత్రం.. ఉత్కంఠగా ట్రైలర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.