yash ramayana : 'కేజీయఫ్', 'కేజీయఫ్-2' చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. ఇప్పటికీ ఒక్క చిత్రం కూడా ప్రకటించలేదు. ఏడాది నుంచి కొత్త చిత్రం గురించి అనౌన్స్ చేయకుండా.. అభిమానులను ఊరిస్తూనే ఉన్నారు. ఆయన కొత్త చిత్రం ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునే ఉన్నారు. అయితే ఆయన భారతీయ సినిమా చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో తెరకెక్కబోతున్న కొత్త 'రామాయణ్' ప్రాజెక్ట్‌లో నటించే అవకాశాలున్నాయని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. రావణాసురుడిగా యశ్ కనిపించబోతున్నారన్న కథనాలన్నీ సర్వత్రా ఉత్కంఠ పెంచాయి.
అయితే దీనిపై ఆ మధ్యలో యశ్ కూడా మాట్లాడారు. ఆ వార్తలను ఖండించారు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, అన్నీ రూమర్సేనని, దిగులు పడొద్దు అంటూ చెప్పారు. అయితే ఇప్పుడీ వ్యాఖ్యలపై యశ్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన రూట్ మార్చినట్టు కథనాలు వస్తున్నాయి. రావణాసురుడి పాత్ర కోసం లుక్ టెస్టుకు రెడీ అయ్యారని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ లుక్ టెస్ట్‌లో అంతా అనుకున్నట్లు జరిగి సంతృప్తికరంగా అనిపిస్తే.. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కు యశ్ ఇంట్రెస్ట్ చూపిస్తారని అంతా అంటున్నారు. చూడాలి మరి యశ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..
ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మంతెనలు కలిసి నిర్మించనున్నారు. దాదాపు రూ. 1500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. నితీశ్ తివారి ఈ భారీ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ఈ ఏడాది చివర్లో ఈ రామాయణ్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఆ మధ్యలో మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చారు. చిత్రంలో రాముడిగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్, సీతగా.. ఆలియా భట్ సీతగా నటించనుందట. ఈ స్టార్ కపుల్ ఇప్పటికే భారీ విజువల్ వండర్ సినిమా 'బ్రహ్మాస్త్ర'లో జంటగా నటించి ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నారు.
ఇదీ చూడండి :
యశ్ కొత్త లుక్ అదుర్స్.. 'సలార్' సినిమా కోసమేనా?
సూపర్ హిట్ సాంగ్‌కు రాఖీ భాయ్ యశ్ డ్యాన్స్.. వీడియో చూశారా?