World Most Successful Film Star : అమెరికాలోని హాలీవుడ్ మొదలు.. మన దేశంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వరకు ప్రపంచంలో మనకు అనేక సినీ ఇండస్ట్రీలు ఉన్నాయి. వీటిల్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ స్టార్ అనగానే టామ్ క్రూజ్, క్రిస్ హేమ్స్ వర్త్, స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ తారలతో పాటు షారుక్ ఖాన్, రజనీ కాంత్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు గుర్తొస్తారు. కానీ వీళ్లెవ్వరూ కాదంటే ఆశ్చర్యం కలగక మానదు. వీళ్లంతా సరిహద్దులు దాటి అనేక మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.
ఈ తారలంతా తమ సినిమాలతో బాక్సాఫీసును అల్లాడించారు. మూవీ స్టార్స్ సక్సెస్‌ను కొలవాలంటే కొన్ని పారామీటర్లుంటాయి. వాటిని బట్టే వారి విజయాల రేటును అంచనా వేస్తారు. అయితే.. బిగ్గెస్ట్ ఫిల్మ్ స్టార్ విషయానికి వస్తే ఈయన ఒక ఫ్రొఫెషనల్ యాక్టర్ కాదు కానీ, సినిమాల్లో కనిపించారు. అవి ఇతర ఏ యాక్టర్ కన్నా ఎక్కువ కలెక్షన్లు రాబట్టాయి. ఇంతకీ ఆయన పేరు స్టాన్ లీ. ఆయన కార్టూనిస్టు, కామిక్ బుక్స్ రైటర్‌గానూ పనిచేశారు. సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన నటుడిగా రికార్డు సొంతం చేసుకున్నారు.
Marvel Comic Writer Stan Lee : కామిక్ బుక్ లెజెండ్ రైటర్‌గా పేరొందిన ఈయన.. తన కెరీర్లో దాదాపు 50 చిత్రాల్లో నటించారు. వీటిల్లో ఎక్కువ శాతం తను క్రియేట్ చేసిన మార్వెల్ కామిక్స్ ఆధారంగా తీసినవే కావడం గమనార్హం. ఈ 50 చిత్రాల్లో సగానికి పైగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించినవే. బాక్సాఫీసు వద్ద ఇవి 30.60 బిలియన్ డాలర్లు (రూ. 25 లక్షల కోట్లు) వసూలు చేయడం విశేషం. ఇది సినిమా రంగం చరిత్రలో ఏ ఇతర నటులతో పోల్చినా అధికమే.
-
Need something to make you smile today? We got you. Please enjoy this pleasantly posed photo of Smilin’ Stan sitting outside. 😊#StanLee #tbt pic.twitter.com/HziTm0tUCs
— Stan Lee (@TheRealStanLee) August 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Need something to make you smile today? We got you. Please enjoy this pleasantly posed photo of Smilin’ Stan sitting outside. 😊#StanLee #tbt pic.twitter.com/HziTm0tUCs
— Stan Lee (@TheRealStanLee) August 31, 2023Need something to make you smile today? We got you. Please enjoy this pleasantly posed photo of Smilin’ Stan sitting outside. 😊#StanLee #tbt pic.twitter.com/HziTm0tUCs
— Stan Lee (@TheRealStanLee) August 31, 2023
ఇదే అంశంలో లీడ్ రూల్స్ పోషించే నటుల విషయానికి వస్తే.. ఇందులో స్కార్లెట్ జాన్సన్‌కు ఆ ఘనత దక్కుతుంది. గ్లోబల్ బాక్సాఫీసు వద్ద ఆయన సినిమాల విలువ 14.56 బిలియన్ డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో అయితే రూ.12 లక్షల కోట్లు. స్టాన్ లీ ఫిల్మ్ కెరీర్ విషయానికి వస్తే.. 1989లో విడుదలైన ది ట్రయల్ ఆఫ్ ద ఇంక్రెడబుల్ హల్క్లో మొదటి సారి తెరపై కనిపించారు. తర్వాత X – Men, Spider Man, Hulk, The Princess Diaries 2 లాంటి మార్వెల్ సినిమాల్లో చిన్న పాత్రలు పోషించారు.
-
Hands up if you’re a left hander! 🙋🏾♂️🙋🏻♀️ Did you know Stan was one too?#StanLee #LeftHandersDay pic.twitter.com/ohDjtLrG3a
— Stan Lee (@TheRealStanLee) August 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hands up if you’re a left hander! 🙋🏾♂️🙋🏻♀️ Did you know Stan was one too?#StanLee #LeftHandersDay pic.twitter.com/ohDjtLrG3a
— Stan Lee (@TheRealStanLee) August 13, 2023Hands up if you’re a left hander! 🙋🏾♂️🙋🏻♀️ Did you know Stan was one too?#StanLee #LeftHandersDay pic.twitter.com/ohDjtLrG3a
— Stan Lee (@TheRealStanLee) August 13, 2023
-
A new exhibit dedicated to Stan debuts today at the @ComicConMuseum, just in time for #SDCC! Here’s a peek at some of the rare comics & art on display, in addition to areas celebrating the work of Jack Kirby, Steve Ditko & more. 👀
— Stan Lee (@TheRealStanLee) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Get tickets: https://t.co/uHDVg1QFEa#StanLee pic.twitter.com/Si0UrtsF1m
">A new exhibit dedicated to Stan debuts today at the @ComicConMuseum, just in time for #SDCC! Here’s a peek at some of the rare comics & art on display, in addition to areas celebrating the work of Jack Kirby, Steve Ditko & more. 👀
— Stan Lee (@TheRealStanLee) July 18, 2023
Get tickets: https://t.co/uHDVg1QFEa#StanLee pic.twitter.com/Si0UrtsF1mA new exhibit dedicated to Stan debuts today at the @ComicConMuseum, just in time for #SDCC! Here’s a peek at some of the rare comics & art on display, in addition to areas celebrating the work of Jack Kirby, Steve Ditko & more. 👀
— Stan Lee (@TheRealStanLee) July 18, 2023
Get tickets: https://t.co/uHDVg1QFEa#StanLee pic.twitter.com/Si0UrtsF1m
స్టాన్ 2008 తర్వాత ఐరన్ మ్యాన్ లాంటి MCU లాంటి ప్రత్యేక చిత్రాల్లో మాత్రమే కనిపించేవారు. ఆయన చివరిసారిగా కనిపించింది అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో. కానీ ఇది ఆయన మరణానంతరం 2019 లో విడుదలైంది. స్టాన్ లీ గౌరవానికి గుర్తుగా మార్వెల్ స్టూడియో ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. తన నూతన చిత్రాల్లో లీ అతిథి పాత్రలను చేయడం నిషేధించాలన్న నిర్ణయం తీసుకుంది. లీ తన సుదీర్ఘ కెరీర్ లో 1940 నుంచి 70 ఏళ్ల పాటు మార్వెల్ కామిక్స్ కోసం పనిచేశారు. X-Men, Spider-Man, the Hulk, Ant-Man, Fantastic Four, Black Panther, Daredevil, Doctor Strange, and Black Widow లాంటి కొన్ని ఐకానిక్ కామిక్ క్యారెక్టర్లను సృష్టించారు.