ETV Bharat / entertainment

అదేంటి.. హన్సిక లవర్​కు ఇంతకుముందే పెళ్లైందా? - హన్సిక లవర్​ సోహైల్​ వెడ్డింగ్​ ట్రైలర్​

నటి హన్సిక వివాహం కోసం ఆమె అభిమానులు ఆశగా ఎదురుచూస్తోన్న వేళ సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. హన్సిక స్నేహితురాలు రింకీ వివాహానికి సంబంధించిన ఈ వీడియో గురించే ఇప్పుడు నెటిజన్లంతా మాట్లాడుకుంటున్నారు. అదేంటి అసలు ఆ వీడియోలో ఏముంది? ఏంటి కథ?

hansika lover sohael viral wedding video

author img

By

Published : Nov 5, 2022, 4:09 PM IST

Hansika Boyfriend: పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా తన స్నేహితుడు సోహైల్‌ ప్రేమకు అంగీకారం తెలిపారు నటి హన్సిక. ఎంతోకాలం నుంచి మిత్రులైన వీరిద్దరూ త్వరలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో జరగనున్న ఈ పెళ్లి వేడుక కోసం నటి అభిమానులు ఆశగా ఎదురుచూస్తోన్న వేళ.. సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. హన్సిక స్నేహితురాలి పెళ్లి వేడుకకు సంబంధించిన ఈ వీడియో చూసి నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

హన్సిక స్నేహితురాళ్లలో ఒకరైన రింకీ వివాహం 2016లో జరిగింది. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో గోవాలోని ఓ రిసార్ట్‌లో ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో హన్సిక సైతం పాల్గొని సందడి చేశారు. సంగీత్‌లో రింకీతో కలిసి డ్యాన్సులు కూడా చేశారు. అయితే, రింకీ వివాహమాడింది వేరెవరినో కాదని సోహైల్‌నేనని.. ప్రేమ వివాహం చేసుకున్న వీళ్లిద్దరూ కొన్నేళ్ల క్రితం విడిపోయారని.. ఇప్పుడు హన్సిక అతడినే వివాహం చేసుకుంటోందని ఈ వీడియో చూసిన నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

వీరి పెళ్లిపై పలు ఆంగ్ల వెబ్‌సైట్లలో వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. మరో వైపు రింకీ-సోహైల్‌ వెడ్డింగ్‌ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. దీనిని చూసిన పలువురు అభిమానులు.. "మేడమ్‌ ఇది నిజమేనా?", "అప్పట్లో ఆయన పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఇప్పుడు వివాహం చేసుకుంటున్నారు" అని కామెంట్స్‌ పెడుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.