ETV Bharat / entertainment

సాయి పల్లవి న్యాయపోరాటం.. కట్టిపడేసేలా 'గార్గి' ట్రైలర్‌ - sai pallavi new movie

సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన 'గార్గి' ట్రైలర్​ గురువారం విడుదలైంది. న్యాయం కోసం పోరాడే యువతి పాత్రలో సాయి పల్లవి ఆకట్టుకుంది.

Watch: Trailer of Sai Pallavi Gargi hints at legal drama
సాయి పల్లవి న్యాయపోరాటం.. కట్టిపడేసేలా 'గార్గి' ట్రైలర్‌
author img

By

Published : Jul 7, 2022, 10:24 PM IST

న్యాయం కోసం పోరాడే యువతి పాత్రలో సాయి పల్లవి నటించిన చిత్రం 'గార్గి'. గౌతమ్‌ రామచ్రంద దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది. తెలుగు ట్రైలర్‌ను నాని, రానాలతో, తమిళ ట్రైలర్‌ను సూర్య, ఆర్య, అనిరుధ్‌, లోకేశ్‌ కనగరాజ్‌లతో విడుదల చేయించింది. ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన అనంతరం వారంతా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే సన్నివేశాలతో ఆసక్తిగా సాగింది. ఈ క్రమంలో వినిపించిన సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. తన నటనతో సాయి పల్లవి ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో రానా సమర్పిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఆహా'లో 'సమ్మతమే': కిరణ్ అబ్బవరం నటించిన 'సమ్మతమే' మూవీ ఓటీటీ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. యూజీ క్రియేషన్స్ బ్యానర్ పై గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 15వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. కిరణ్ జోడీగా చాందినీ చౌదరి నటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.