ETV Bharat / entertainment

'ప్రేక్షకుల ఛాలెంజ్​కు సమాధానమే 'విరూపాక్ష'.. ఆ ఆర్టిస్ట్​ను ఎప్పటికీ మరిచిపోలేను' - సంయుక్త మీనన్ విరూపాక్ష సినిమా హీరోయిన్

ఇటీవల విడుదలైన 'విరూపాక్ష' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్​ సక్సెస్​ మీట్​ నిర్వహించింది. ఈ సభలో హీరో సాయిధరమ్​ తేజ్​ మాట్లాడుతూ.. ప్రేక్షకులు చేసిన సవాల్​ స్వీకరించి.. వారిని మెప్పించే కథతో థియేటర్లకు వచ్చాం అన్నారు. ఇంకా ఏమన్నారంటే..

virupaksha success meet sai dharam tej
virupaksha success meet sai dharam tej
author img

By

Published : Apr 23, 2023, 10:36 PM IST

మెగా హీరో సాయిధరమ్​ తేజ్​ నటించిన చిత్రం 'విరూపాక్ష'. ఏప్రిల్​ 21న విడుదలైన ఈ సినిమా.. పాజిటివ్​ టాక్​లో బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్తోంది. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్​ హైదరాబాద్​లో సక్సెస్​ మీట్​ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కథానాయకుడు సాయిధరమ్​ తేజ్​ మాట్లాడారు. బలమైన, వినూత్న స్టోరీ ఉంటే థియేటర్లకు వచ్చి సినిమా చూస్తామని ప్రేక్షకులు విసిరిన సవాలు స్వీకరించామన్నారు. ఆ సవాలుకు సమాధానమే ఈ 'విరూపాక్ష' అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సక్సెస్​ మీట్​కు దర్శకులు మారుతి , గోపీచంద్‌ మలినేని ముఖ్య అతిథులుగా హాజరై, 'విరూపాక్ష' మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు కార్తిక్‌ దండు తెరకెక్కించిన ఈ సినిమాలో సాయిధరమ్​ తేజ్​ సరసన సంయుక్త ఆడిపాడింది.

ఈ వేడుకను ఉద్దేశించి సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడారు. ''ఈ విజయం మా సినిమా యూనిట్​దే కాదు. తెలుగు చలన సినిమా పరిశ్రమకు చెందిన అందరిది. గతేడాది కొన్ని చిత్రాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లలేదు. 'మేం థియేటర్లకు రావాలంటే కథ అద్భుతంగా ఉండాలి' అని మాకు సవాలు విసిరారు. మీ సవాల్​ని స్వీకరించాం. దానికి సమాధానమే ఈ 'విరూపాక్ష' సినిమా. ఈ మూవీలోని మెయిన్‌ ఆర్టిస్ట్‌ గురించి చెప్పడం అందరూ మర్చిపోయారు. కానీ, నేను మర్చిపోలేదు. అదెవరో కాదు.. కాకి'' అంటూ నవ్వులు పూయించారు. తనకు యాక్సిడెంట్​ తర్వాత తనకు ట్రీట్​మెంట్​ చేసిన వైద్యులకు.. ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విరూపాక్ష సినిమా దర్శకుడు కార్తి మాట్లాడుతూ.. ''ఈ చిత్రం విషయంలో.. ముఖ్యంగా బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​ గురించి మాట్లాడుతున్నారు. ఆ పనిని ఆరున్నర రోజుల్లో పూర్తి చేశాడు అజనీష్‌ లోక్‌నాథ్‌. ఇంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అని చెప్పుకొచ్చారు.

సాయిధరమ్​ తేజ్​పై నాకు కోపం ఉంది : మారుతి
''హారర్​ సినిమాలంటే సాయిధరమ్‌ తేజ్‌కు చాలా భయం. కానీ, అలాంటి వ్యక్తి 'విరూపాక్ష'లో నటించాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరోవైపు అతడిపై కోపం కూడా ఉంది. ఎందుకంటే అలాంటి జానర్‌ చిత్రాల్లో ఎప్పుడూ నటించనని నాతో సాయిధరమ్​ తేజ్​ చెప్పాడు. నేను తీసిన సినిమా 'ప్రేమకథా చిత్రమ్‌' చూశావా అని అడిగితే 'అది హారర్‌ సినిమా అంటున్నారు. నేను చూడను' అన్నాడు. కానీ, కథ చాలా బాగా నచ్చిందంటూ ఓ రోజు 'విరూపాక్ష' గురించి వివరించాడు. సాయి ఇష్టపడని నేపథ్యానికి సంబంధించిన స్టోరీ చెప్పి, సినిమా తీసినప్పుడే దర్శకుడు కార్తిక్‌ సక్సెస్‌ అందుకున్నాడు" తన అనుభవం పంచుకున్నారు దర్శకుడు మారుతి.

కార్తిక్‌, సాయి రియల్‌ హీరోలు: గోపీచంద్‌
''సాయిధరమ్‌ తేజ్‌ నా సోదరుడి లాంటి వాడు. 'విరూపాక్ష' సినిమా విజయంతో తనెంత ఆనందంగా ఉన్నాడో నేను కూడా అంతే ఆనందిస్తున్నాను. సమస్యలు ఎదురైనా తట్టుకుని మళ్లీ ఫామ్‌లోకి రావడం స్ఫూర్తిదాయకం. ఈ సినిమా దర్శకుడు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారనే విషయం ఇక్కడికి వచ్చాక తెలిసింది. వీరిద్దరు రియల్‌ హీరోలు. విరూపాక్ష చాలా అద్భుతంగా ఉంది. ఇది ఊహకందని కథ. ఆద్యంతం ఆసక్తి రేకెత్తించింది'' అని దర్శకుడు మలినేని గోపీచంద్‌ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.