ETV Bharat / entertainment

గంభీర్​తో​ వివాదం.. బీసీసీఐ అధికారులకు కోహ్లీ లేఖ.. అది కరెక్ట్​ కాదంటూ.. - bcci on gambhir kohli controversy

Kohli vs Gambhir IPL Fight : గంభీర్​తో జరిగిన గొడవపై బీసీసీఐకి విరాట్​ కోహ్లీ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. తనపై బోర్డు విధించిన పన్ను విషయమై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Kohli vs Gambhir IPL Fight
Kohli vs Gambhir IPL Fight
author img

By

Published : May 6, 2023, 1:58 PM IST

Updated : May 6, 2023, 3:48 PM IST

Kohli vs Gambhir IPL Fight : లఖ్​నవూ-ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్​లో గంభీర్​-కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాదం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సోషల్​మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరిగింది. ఈ వాగ్వాదంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు. దీనిపై పలువురు మాజీలు కూడా స్పందించారు. కొంతమంది గంభీర్​కు మద్దతు పలకగా.. మరికొందరూ కోహ్లీకి మద్దతు పలికారు. అయితే ఈ గొడవ జరిగిన ఐదు రోజుల తర్వాత బీసీసీఐ అధికారులకు ఓ లేఖ రాసి జరిగిన విషయం గురించి కోహ్లీ వివరణ ఇచ్చినట్లు తెలిసింది.

ఆ లేఖలో విరాట్​.. తనపై బీసీసీఐ విధించిన జరిమానా గురించి విరాట్​ అసహనం వ్యక్తపరిచాడని సమాచారం. తాను నవీన్-ఉల్-హక్, గంభీర్‌లను కవ్వించలేదని పేర్కొన్నాడట. అంతకుముందు గంభీర్​-కోహ్లీ మధ్య జరిగిన వాగ్వాదాన్ని పరిశీలించిన యాజమాన్యం.. ఐపీఎల్​ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు.. లెవల్ 2 నేరంగా పరిగణించి ఆ ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. కోహ్లీకి రూ.కోటి రూపాయల జరిమానా విధించగా.. గంభీర్​కు రూ.24 లక్షలు ఫైన్ విధించింది.

మరోవైపు మ్యాచ్​ సమయంలో బెంగళూరు టీమ్​ పేసర్ మహమ్మద్​ సిరాజ్.. నవీన్​ ఉల్​ హక్​కు​ వేసిన బౌన్సర్లపై కూడా లేఖలో విరాట్ వివరణ ఇచ్చాడు. నవీన్​ను టార్గెట్​ చేయమని తానేమని చెప్పలేదని కేవలం బౌన్సర్లను వేయమని మాత్రమే సూచించానని పేర్కొన్నట్లు సమాచారం. అయితే నవీన్ ఉల్​ హక్,​ కేయిల్​ మేయర్స్​ అమిత్​ మిశ్రాలపై విరాట్​ చూపించిన ఆవేశమే ఈ వాగ్వాదానికి కారణమని సమాచారం.

అయితే మ్యాచ్​ సమయంలో విరాట్​తో దురుసుగా ప్రవర్తించినందుకు నవీన్ ఉల్ హక్​కు కూడా మ్యాచ్​ ఫీజ్​లో 50 శాతం జరిమానా విధించారు. ఇక ఈ విషయంపై కూడా నివేదికలో విరాట్​ స్పందిచాడట. మ్యాచ్​లో జరిగిన వాగ్వాదం తర్వాత విరాట్​ను మేయర్స్​ సమాధానపరుస్తున్న సమయంలో లఖ్​నవూ మెంటార్​ గౌతమ్​ గంభీర్​ మధ్యలోకి దూరి మేయర్స్​ను పక్కకు తీసుకెళ్లాడని.. దాని వల్లనే తనకు గంభీర్​కు మధ్య వాగ్వాదం పెద్దదైందని తెలిపాడు.
అయితే లఖ్​నవూ కెప్టెన్ కేఎల్​ రాహుల్​.. వాగ్వాదం జరిగిన తర్వాత పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. నవీన్​ ఉల్​ హక్​ను పక్కకు తీసుకెళ్లి సంధికి రమ్మని చెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ రాహుల్​ మాటలను చెవినబెట్టని నవీన్..​ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

'గంభీర్‌ ఇప్పుడేమీ ఆడటం లేదు కదా'..
ఇక ఇదే వివాదంపై గత కొద్ది రోజులుగా మీడియా వేదికగా పలువురు మాజీ క్రీడాకారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే దిల్లీ క్యాపిటల్స్‌ సహాయక కోచ్.. మాజీ ప్లేయర్​ షేన్ వాట్సన్ కూడా స్పందించాడు. శనివారం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో దిల్లీ తలపడనుంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో వాట్సన్ మాట్లాడాడు. క్రికెటర్లు ఎవరైనా సరే మైదానం వెలుపల మంచి సంబంధాలను కలిగి ఉండాలని సూచించాడు. గేమ్‌లో విజయం కోసం చివరి వరకూ జరిగే పోరాటం బాగుండాలని.. అయితే మ్యాచ్‌ ముగిశాక మాత్రం కలిసిపోవాలని వాట్సన్​ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: Kohli vs Gambhir : విరాట్ రివెంజ్​.. గంభీర్​తో ఫైట్..​ ఇద్దరికీ 100%​ ఫైన్​!

Last Updated : May 6, 2023, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.