Chiranjeevi vijay sethupati movie: ప్రముఖ నటుడు చిరంజీవి-దర్శకుడు కె. ఎస్. రవీంద్ర(బాబీ) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'మెగా 154' వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో చిరంజీవికి ప్రతినాయకుడిగా ఎవరు నటిస్తారనే అనే ప్రశ్నకు సినీవర్గాల నుంచి ఓ సమాధానం అందుతోంది. పవర్ఫుల్ విలన్‌గా విజయ్‌సేతుపతి నటించనున్నారనే వార్త ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంటర్వెల్లో ఈ పాత్ర రివీల్ అవుతుందట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, విజయ్ సేతుపతి గతంలో 'సైరా' చిరంజీవికి అనుచరుడిగా నటించారు.
వ్యక్తిగతంగా చిరంజీవి అభిమాని అయిన బాబీ ఈ చిత్రాన్ని మాస్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిరంజీవి లుక్స్‌నుబట్టి ఆయన మత్య్సకారుడిగా నటిస్తారని తెలుస్తోంది. ఇక చిరంజీవి ప్రస్తుతం 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: టాలీవుడ్‌పై నటుడు సుమన్ షాకింగ్ కామెంట్స్!