Vijay Varma Latest Interview : బాలీవుడ్ స్టార్ విజయ్ వర్మ ప్రస్తుతం బీటౌన్‌లో మోస్ట్ పాపులర్ హీరోగా రాణిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈ యంగ్ స్టార్.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తున్నారు. 2008లో ఒక షార్ట్ ఫిల్మ్‌తో నటుడిగా పరిచయమైన ఆయన తన సినీ కెరీర్‌ను 'చిట్టగాంగ్'తో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. ఆ తర్వాత బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'పింక్' సినిమాతో ఆకట్టుకున్నారు. 'ఎంసీఏ' సినిమాలో విలన్‌గా టాలీవుడ్‌కు పరిచమయ్యారు. హిందీలో తెరకెక్కిన 'డార్లింగ్స్' సినిమాతో సూపర్ పాపులర్ అయ్యారు. తాజాగా అనౌన్స్ అయిన 'సూర్య 43' సినిమలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
"కెరీర్ తొలి రోజుల్లో నాకు ఓ మంచి ప్రాజెక్ట్‌లో అవకాశమొచ్చింది. మరికొన్ని ఫొటోలు పంపమని వారు ఫోన్ చేశారు. అయితే కొన్ని రోజులకే నన్ను ఆ ప్రాజెక్ట్‌లో నుంచి తీసేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ డైరెక్టర్‌కు సలహాలిచ్చే ఓ జ్యోతిష్యుడికి నేను నచ్చని కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి నన్నుతీసేసినట్లు ఆ తర్వాత కొన్ని రోజులకు తెలిసింది. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. అప్పుడు నాకు బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ధైర్యం చెప్పారు. సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇలాంటి ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొవాలని ఆయన అన్నారు. ఏది కూడా అంత సులభంగా రాదని ఆయన తెలిపారు. ఆయన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. ఎప్పటికైనా పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను. నా రోజు కోసం ఎంతగానో ఎదురుచూశాను. అందిన అవకాశాలను వినియోగించుకుని నటుడిగా ఎదిగాను" అని చెప్పారు.
అర్థిక ఇబ్బందులను ఎదుర్కొవడం కోసం కొన్నిసందర్భాల్లో ఇష్టం లేకపోయినప్పటికీ చిన్న పాత్రల్లో నటించినట్లు విజయ్ తెలిపారు. ఆ సమయంలోనే 'మాన్సూన్ షూటౌట్' అనే సినిమాలో అవకాశం వచ్చినట్లు ఆయన చెప్పారు. ఇక అప్పటి నుంచి వరుసగా ఆఫర్లు వచ్చాయని విజయ్ ఎమోషనల్ అయ్యారు.
18 ఏళ్ల 'నో కిస్' రూల్‌ను బ్రేక్ చేసిన తమన్నా.. ఈ డెసిషన్ 'విజయ్' కోసమేనట!