Ranjithame Telugu Song: 'రంజితమే.. రంజితమే'.. ఇప్పుడు తమిళ సినీ ప్రియులతో డ్యాన్స్ చేయిస్తోన్న పాట ఇది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన 'వారిసు'లోని ఈ పాట విడుదలైన కొన్నిరోజుల్లోనే 7 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పుడిదే పాటకు తెలుగు వెర్షన్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. ‘రంజితమే’ అంటూ సాగే ఈ తెలుగు పాటకు ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. తమిళంలో విజయ్ పాడిన ఈ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి, ఎం.ఎం.మానసి ఆలపించారు. ఇక, తమన్ అందించిన మ్యూజిక్ యూత్‌తో డ్యాన్స్ చేయించేలా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'బీస్ట్' తర్వాత విజయ్ నటిస్తోన్న చిత్రమిది. వంశీపైడిపల్లి దర్శకుడు. రష్మిక కథానాయిక. దిల్ రాజు నిర్మాత. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని తెలుగులో 'వారసుడు' పేరుతో విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈసినిమా షూట్ శర వేగంగా జరుగుతోంది. జయసుధ, ఖుష్బూ, శరత్‌కుమార్, శ్రీకాంత్, ప్రభు కీలకపాత్రలు పోషిస్తున్నారు.