Vijay Lokesh Movie Leo : మాస్టర్ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ - హీరో దళపతి విజయ్ మరోసారి కలిసి లియో సినిమా కోసం పనిచేస్తున్నారు. కమల్ హాసన్‌తో 'విక్రమ్' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం వల్ల సినిమా భారీ రేంజ్లో హైప్ ఉంది.
తాజాగా ఈ చిత్రం గురించి ఓ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ న్యూస్ బయట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ చిత్రం ఫ్రీమేక్ అని అంతా మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ సినిమా 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్' ఆధారంగా దీన్ని దర్శకుడు లోకేశ్ తెరకెక్కించారని టాక్ వినిపిస్తోంది. డేవిడ్ క్రోనెన్ బర్గ్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ ఇంగ్లీష్ మూవీ.. కల్ట్ క్లాసిక్ గ్యాంగ్‌స్టర్ సినిమాగా నిలిచింది.
అయితే ఈ చిత్రాన్ని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చూసేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో జగపతి బాబు ప్రధాన పాత్రలో సీన్ టు సీన్ రీమేక్ చేశారు. 2010లో గాయం 2 పేరుతో రిలీజైన ఈ చిత్రం బాగానే ఆడింది. ఇప్పుడు అజే 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్' సినిమాలోని ఓ కోర్ పాయింట్‌ను తీసుకుని దర్శకుడు లోకేశ్ తనదైన స్టైల్లో డైరెక్ట్ చేశారట. ఎలాగో లోకేశ్ ప్రతిభ ఎలాంటిదో ఇప్పటికే ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలతో చూశాం. కాబట్టి లియోను కాపీలా కాకుండా అద్భుతంగా తెరకెక్కించే ఉంటారని అంటున్నారు. ఇకపోతే ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు బాగానే ఆకట్టుకున్నాయి. సినిమాపై మంచి అంచనాలను మరింత పెంచాయి.
Leo Movie Release Date 2023 : ఇకపోతే ఈ సినిమా దసరా పండగకు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా రానుంది. తెలుగులో బాలకృష్ణ భగవంత్ కేసరి , రవితేజ టైగర్ నాగేశ్వరరావులతో ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు పోటీ పడనుంది. చూడాలి మరి జరగబోయే ఈ త్రిముఖ పోరులో లియో ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో?
-
KEEP CALM AND AVOID THE BATTLE
— Seven Screen Studio (@7screenstudio) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch out.. #LeoPosterFeast will unveil stories, one poster at a time 😁
Aatalu paatalu tho mee #Leo Telugu lo release avthundhi 🔥#LeoTeluguPoster #Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @duttsanjay… pic.twitter.com/ryXr9ufWs8
">KEEP CALM AND AVOID THE BATTLE
— Seven Screen Studio (@7screenstudio) September 17, 2023
Watch out.. #LeoPosterFeast will unveil stories, one poster at a time 😁
Aatalu paatalu tho mee #Leo Telugu lo release avthundhi 🔥#LeoTeluguPoster #Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @duttsanjay… pic.twitter.com/ryXr9ufWs8KEEP CALM AND AVOID THE BATTLE
— Seven Screen Studio (@7screenstudio) September 17, 2023
Watch out.. #LeoPosterFeast will unveil stories, one poster at a time 😁
Aatalu paatalu tho mee #Leo Telugu lo release avthundhi 🔥#LeoTeluguPoster #Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @duttsanjay… pic.twitter.com/ryXr9ufWs8
Trisha Latest photoshoot : ఏముంది భయ్యా త్రిష.. ఆ అందాన్ని ఎవరూ మ్యాచ్ చేయలేరేమో!
Upcoming Movies 2023 Salaar To Leo : 'జవాన్' వచ్చేసింది.. ఇక అందరీ కళ్లు ఆ చిత్రాలపైనే!