ETV Bharat / entertainment

సమంతపై ప్రాంక్​.. విజయ్​ సర్​ప్రైజ్​ మామూలుగా లేదుగా! - యశోద ఫస్ట్ గ్లింప్స్

Vijay Devarakonda Samantha: స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో నటిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతుంది. అయితే గురువారం సామ్​ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు విజయ్‌. షూటింగ్‌ సీన్‌ అంటూ ఒక ఫేక్ డైలాగ్‌ను సామ్​తో రిహార్సల్‌ జరిపించారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

vijay-deverakonda-surprises-samantha-on-her-birthday

author img

By

Published : Apr 28, 2022, 9:46 PM IST

Vijay Devarakonda Samantha Surprise: యువ నటుడు విజయ్‌ దేవరకొండ.. సమంతకు ఎప్పటికీ మరిచిపోలేని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తాము నటిస్తున్న సినిమా స్రిప్టులో లేని సన్నివేశాన్ని చెప్పించి కంటతడి పెట్టేలా చేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ ఇద్దరు నటిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. ఆ సెట్స్‌లోనే విజయ్‌ తన సృజనాత్మకతను బయటపెట్టారు.

ఏప్రిల్‌ 28 సమంత పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర దర్శకుడితో ఓ ఫేక్‌ సీన్‌ రాయించాడు. ఈ విషయం తెలియని సమంత సన్నివేశంలో లీనమై, భావోద్వేగానికి గురైంది. "ఎందుకిలా ఉన్నావ్‌? నేను వెళ్లిపోతున్నందుకా? పది రోజుల్లో వచ్చేస్తా. నువ్వు మా ఊరొచ్చి మా తల్లిదండ్రులతో మాట్లాడటం కాదు.. నేనే మీ వాళ్లతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తా" అంటూ సమంత ఫీల్‌ అవుతుండగా విజయ్‌ 'హ్యాపీ బర్త్‌డే' అని ఆమెను ఆశ్చర్యంలో పడేశారు. తర్వాత దర్శకుడు, సాంకేతిక నిపుణులు కేకును తీసుకొచ్చి, సమంతతో కట్‌ చేయించారు. ఈ సర్‌ప్రైజ్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

ఇంకా టైటిల్‌ ఖరారుకాని ఈ సినిమా 'వీడీ 11' వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రొమాటింక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా.. జి.మురళి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Samantha Yashoda Update: స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆమె యశోద సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్నారు. ఆగస్టు12న ఈ సినిమా విడుదల కానుంది. గురువారం సమంత బర్త్‌డే సందర్భంగా యశోద సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ చిత్రం​ ఫస్ట్‌ గ్లింప్స్‌ను మే5న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరి, హరీష్‌లు దర్శకత్వం వహించగా, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇవీ చదవండి: 'సర్కారు వారి పాట' ట్రైలర్ అప్డేట్​.. 'సమ్మతమే' రిలీజ్​ డేట్​ ఫిక్స్​

'ఆ పాట వల్ల చిరంజీవి ఇమేజ్​ ఏం దెబ్బతినదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.