ETV Bharat / entertainment

విజయ్​ దేవరకొండతో రిలేషన్​.. వైరల్​గా సమంత​ పోస్ట్​!​ - kushi release date

విజయ్​ దేవరకొండతో రిలేషన్​​ గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్​ చేశారు నటి సమంత. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

samantha insta post on vijay deverakonda
'నీలాంటి ఫ్రెండ్​ చాలా అరుదుగా దొరుకుతారు'.. రౌడీ బాయ్​పై సామ్​ కామెంట్స్​!
author img

By

Published : Jun 1, 2023, 5:30 PM IST

Updated : Jun 1, 2023, 6:30 PM IST

Vijay Devarkonda Samantha Relationship : రౌడీ బాయ్​ విజయ్​ దేవరకొండకు సంబంధంచి ఓ ఆసక్తికరమైన పోస్ట్​ను తన ఇన్​స్టాగ్రామ్​ హ్యాండిల్​లో అభిమానులతో పంచుకున్నారు టాలీవుడ్​ హీరోయిన్​ సమంత. "విజయ్‌ దేవరకొండ.. నీ ఉన్నతస్థాయి, సంతోషాలను అలాగే నీ కష్టాలనూ నేను చూశాను. నువ్వు చివర్లో ఉండటాన్ని చూశాను. ప్రథమస్థానంలోకి వచ్చినప్పుడూ చూశా. నీ జీవితంలోని ఎత్తుపల్లాలను చూశాను. ఎలాంటి సమయాల్లోనైనా కొంతమంది స్నేహితులు మనతోనే ఉండిపోతారు" అని ఆమె రాసుకొచ్చారు. దీనిపై రౌడీ బాయ్‌ స్పందిస్తూ.. సామ్‌ తన ఫేవరెట్‌ లేడీ అని చెప్పారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. వీరి ఫ్రెండ్‌షిప్‌ చూడముచ్చటగా ఉందంటూ కామెంట్స్​ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ షూటింగ్​ షెడ్యూల్​ టర్కీలో జరుగుతోంది. ఇప్పటికే టర్కీలో వీరిద్దరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను వారిద్దరూ షేర్​ చేశారు.​

Kushi Movie 2023 : ఇక ఖుషి సినిమా విషయానికి వస్తే.. 'మహానటి' తర్వాత మరోసారి ఈ సినిమాలో స్క్రీన్​ షేర్​ చేసుకుంటున్నారు సమంత-విజయ్​ దేవరకొండ జంట. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ లవ్ స్టోరీ మూవీ ఎన్నో అంచనాలతో రిలీజౌతోంది. ఇందులో సచిన్ ఖేడేకర్,​ జయరామ్​, లక్ష్మీ, మురళీ శర్మ, రోహిణి, రాహుల్ రామకృష్ణ, అలీ, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషించారు. కశ్మీర్‌ బ్యాక్‌డ్రాప్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

Kushi First Single : ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్​ నుంచి ఫస్ట్​ సింగిల్​.. ఇలా అన్నీ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. మ్యూజిక్​ పరంగానూ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన 'నా రోజా నువ్వే' అనే ఫస్ట్ సింగిల్​.. మ్యూజిక్​ లవర్స్​ను అట్రాక్ట్​ చేస్తోంది. మరోవైపు త్వరలో ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్​ని విడుదల చేసేందుకు మూవీ టీమ్​ రెడీగా ఉన్నట్లు టాక్​.

Kushi 2023 Release Date : నిజానికి ఈ సినిమా రెండు నెలల ముందే రిలీజ్ కావాల్సింది. కానీ సమంత అనారోగ్య సమస్యల కారణంగా మూవీ షూటింగ్‌ కాస్త ఆలస్యమైంది. దీంతో ఈ సినిమా రిలీజ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు మేకర్స్​. కాగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా గ్రాండ్​గా విడుదల కానుంది. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 1, 2023, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.