Vijay Devarakonda Fans : విజయ్ దేవరకొండ, అనన్యపాండే జంటగా నటించిన లైగర్ ఆశించిన ఫలితం సాధించకపోవడం వల్ల ఆ చిత్రయూనిట్ నిరాశలో మునిగిపోయింది. దానికి తోడు సోషల్‌మీడియాలో ట్రోల్స్ ఎక్కువవ్వడంతో, లైగర్ దర్శక, నిర్మాతలు వారి వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలకు కొంతకాలం విరామం ఇచ్చారు. అయితే చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ తాజాగా జరిగిన సైమా వేడుకకు హాజరయ్యాడు. సైమా వేడుకలో సందడి చేసిన విజయ్ ఎప్పటిలానే తన అభిమానులను ఖుషీ చేశాడు.
చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. లైగర్ విడుదలకు ముందు చివరి పోస్ట్ పెట్టిన విజయ్, ఇప్పుడు తానొక్కడే నిల్చుని ఉన్న ఫొటోని ఉంచి 'సింగిల్ ఫైటర్' అని క్యాప్షన్ జత చేశాడు. ఎప్పుడూ సోషల్‌మీడియాలో చురుకుగా ఉండే విజయ్ 'లైగర్' విడుదలయ్యాక పెట్టిన మొదటి పోస్ట్ ఇదే. ఈ ఫోటోకు 19గంటల్లోనే మిలియన్ లైకులు వచ్చాయి. విజయ్‌కు మద్దతు తెలుపుతూ అతని అభిమానులు పలు కామెంట్స్ పెట్టారు. 'నీ సినిమా ప్లాఫ్ అయినా, నువ్వు నిజమైన లైగర్‌వి', 'నువ్వసలు తగ్గొద్దన్న', 'ట్రోల్స్ ని పట్టించుకోవద్దు నువ్వొక హీరో', 'ఫీనిక్స్‌లా కంబ్యాక్ ఇవ్వాలి', 'నువ్వు మళ్లీ మా ముందుకొచ్చావ్..హ్యాట్సాఫ్' అంటూ కామెంట్లతో విజయ్‌ని అభినందించారు.
'లైగర్' అనంతరం విజయ్ 'జనగణమన' చేయాల్సి ఉన్నా ప్రస్తుతం ఆ ప్రాజెక్టుపై ప్రతిష్టంభన నెలకొంది. ఇంకా సమంతతో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ఖుషి డిసెంబరు 23న విడుదలవ్వాల్సి ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదలవనున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది.
ఇవీ చదవండి: ఈ భామల సొగసు చూడతరమా.. చూస్తే కను రెప్ప వేయగలమా!
మల్టీప్లెక్స్‌లో రూ.75కే సినిమా.. ఆఫర్లో చిన్న ఛేంజ్.. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి!