ETV Bharat / entertainment

Vijay Devarakonda Family Star Movie : 'ఫ్యామిలీ స్టార్'​గా రౌడీ హీరో.. గ్లింప్స్​ చూశారా ? - విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్

Vijay Devarakonda Family Star Movie : రౌడీ హీరో విజయ్ దేవరకొండ- దర్శకుడు పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్​ మూవీకి మేకర్స్​ నామకరణం చేశారు. దీంతో పాటు ఫ్యాన్స్​ కోసం ఓ స్పెషల్ గ్లింప్స్​ను విడుదల చేశారు. దాన్ని మీరు కూడా ఓ లుక్కేయండి..

Vijay Devarakonda Family Star Movie
Vijay Devarakonda Family Star Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 8:05 PM IST

Updated : Oct 18, 2023, 8:46 PM IST

Vijay Devarakonda Family Star Movie : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా 'ఖుషి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్'​గా రానున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ టీమ్​.. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్​తో పాటు ఓ స్పెషల్​ పోస్టర్​ను రివీల్​ చేశారు. అందులో ఈ సినిమాకు 'ఫ్యామిలీ స్టార్​' అనే పేరును నామకరణం చేశారు.

విజయ్​ - పరశురామ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమంతో గ్రాండ్​గా స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబోలో ఇదివరకు వచ్చిన 'గీతా గోవిందం' సూపర్ హిట్ అవ్వడం వల్ల.. ఫ్యాన్స్​ ఈ సినిమాపై ఎక్స్​పెక్టేషనన్స్​ పెంచుకుంటున్నారు. 2018లో వచ్చిన ఈ సినిమా అటు యూత్​తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియోన్స్​ను ఎంటర్​​టైన్​ చేసి బాక్సాఫీస్​ వద్ద మంచి హిట్​ అందుకుంది. అంతే కాకుండా అర్జున్ రెడ్డి తర్వాత విజయ్​ కెరీర్​ను మలుపు తిప్పిన సినిమాల్లో 'గీత గోవిందం' కూడా ఒకటి. ఆ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరూ 'ఫ్యామిలీ మ్యాన్​ కోసం' జత కట్టారు.

ఇక సినిమా విషయానికొస్తే.. సీతారామమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, నటి దివ్యాన్షా కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్​రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై రూపొందిస్తున్నారు. ఇక గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతమ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. కేయూ మోహన్ సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విజయ్ VD 12 : ఇక మరోవైపు హీరో విజయ్.. 'జెర్సీ' డైరెక్టర్​ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం VD 12 అనే వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతోంది. అయితే ఎప్పటిలాగే ఎమోషనల్​ డ్రామాతో కూడిన కథతో కాకుండా.. గౌతమ్​ ఈ సినిమాను గ్యాంగ్​స్టర్​ నేపథ్యంలో తీయనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్​గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఈ సినిమాను సితార ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్​పై రూపొందిస్తున్నారు.

Vijay Devarakonda 100 Fans : మాట నిలబెట్టుకున్న విజయ్​.. ఆ 100 కుటుంబాలకు రూ.కోటి రూపాయలు.. లిస్ట్ ఇదే

విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల.. గ్రాండ్​గా స్టార్ట్​ అయిన VD 12

Last Updated : Oct 18, 2023, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.