Vijay Devarakonda Family Star Shooting : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మూవీ టీమ్ న్యూయార్క్‌లో సందడి చేస్తోంది.
-
@TheDeverakonda's #Familystar Glimpse screening in Times Square,New York.#VijayDeverakonda #Airanevanchalaenti pic.twitter.com/CKxG2PXnEm
— ᴛʜᴏᴍᴀs sʜᴇʟʙʏ 💣 (@rowdy_nikki) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">@TheDeverakonda's #Familystar Glimpse screening in Times Square,New York.#VijayDeverakonda #Airanevanchalaenti pic.twitter.com/CKxG2PXnEm
— ᴛʜᴏᴍᴀs sʜᴇʟʙʏ 💣 (@rowdy_nikki) December 19, 2023@TheDeverakonda's #Familystar Glimpse screening in Times Square,New York.#VijayDeverakonda #Airanevanchalaenti pic.twitter.com/CKxG2PXnEm
— ᴛʜᴏᴍᴀs sʜᴇʟʙʏ 💣 (@rowdy_nikki) December 19, 2023
అయితే ఈ సినిమా షూటింగ్ కోసం న్యూయార్క్‌లోనే ఉన్న విజయ్ ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు అక్కడి అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ వేదికగా 'ఫ్యామిలీ స్టార్' గ్లింప్స్‌ను చూపించారు. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఎంతో ఆనందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.
మరోవైపు మంగళవారంతో అమెరికాలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత భారత్‌లో మరో 15 రోజులు షెడ్యూల్ ఉండనుందని ఫ్యాన్స్ . దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని గతంలో నిర్మాత దిల్ రాజు చెప్పారు.
-
Fan's meet in New York aa OK OK 😀🤗❤#VijayDeverakonda #FamilyStar #NewYork pic.twitter.com/FhAGj5kQsh
— THE Pavan Kumar Suman⭐ (@cult1_rowdy) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fan's meet in New York aa OK OK 😀🤗❤#VijayDeverakonda #FamilyStar #NewYork pic.twitter.com/FhAGj5kQsh
— THE Pavan Kumar Suman⭐ (@cult1_rowdy) December 18, 2023Fan's meet in New York aa OK OK 😀🤗❤#VijayDeverakonda #FamilyStar #NewYork pic.twitter.com/FhAGj5kQsh
— THE Pavan Kumar Suman⭐ (@cult1_rowdy) December 18, 2023
Family Star Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో మృణాల్తో పాటు దివ్యాన్ష కౌశిక్ నటిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేశ్, కేయూ మోహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను చేపట్టగా, ఏఎస్ ప్రకాశ్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో 'ఐరనే వంచాలా ఏంటి' అంటూ విజయ్ చెప్పే లైన్ నెట్టింట తెగ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.
Vijay Devarakonda Movies : మరోవైపు విజయ్ లైనప్ విషయానికొస్తే రౌడీ బాయ్ ప్రస్తుతం తన 12వ సినిమాను 'జెర్సీ' ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ నాయుడు తిన్ననూరితో కలిసి చేస్తున్నారు. దీన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించుకున్న ఈ మూవీకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
సంక్రాంతి రేసు నుంచి 'ఫ్యామిలీ స్టార్' ఔట్ - అదే కారణమా?
Vijay Devarakonda Family Star Movie : 'ఫ్యామిలీ స్టార్'గా రౌడీ హీరో.. గ్లింప్స్ చూశారా ?