ETV Bharat / entertainment

Vijay Beast review: విజయ్​ 'బీస్ట్​'.. ఎలా ఉందంటే?

author img

By

Published : Apr 13, 2022, 7:40 AM IST

Updated : Apr 13, 2022, 8:20 AM IST

Vijay Beast movie twitter review: నెల్సన్​ దిలీప్ కుమార్​ దర్శకత్వంలో తమిళ​ స్టార్​ హీరో నటించిన 'బీస్ట్'​ చిత్రం విడుదలైంది. పూజాహెగ్డే హీరోయిన్​. ఉగ్రవాద కథ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ సోషల్​మీడియా రివ్యూ చూసేద్దాం...

Vijay Beast review
Vijay Beast review

Vijay Beast movie twitter review: కోలీవుడ్​ స్టార్ హీరో విజయ్​ నటించిన 'బీస్ట్'​ ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా సోషల్​మీడియాలో ఎక్కువ శాతం పాజిటివ్​ టాక్​తో దూసుకెళ్తోంది. కొంతమంది నుంచి మాత్రం నెగటివ్​ టాక్ వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ తమ అభిమాన హీరోను తెరపై చూసేందుకు అభిమానులు హాళ్లకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు థియేటర్లు ఫ్యాన్స్​తో కిక్కిరిసిపోయాయి. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. బెనిఫిట్​ షోలు చూసి వచ్చిన వారు సోషల్​ మీడియా వేదికగా తమ అభిప్రాయలను తెలుపుతూ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు. సినిమా అదిరిపోయిందని ట్వీట్లు చేస్తున్నారు. విజయ్​ ఎంట్రీ అదిరిపోయే ఫైట్​తో మొదలవుతుందని చెబుతున్నారు. కథలో కొత్తదనం లేకపోయినా విజయ్​ నటన, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​, సాంగ్స్​ సినిమాకు హెలైట్​గా నిలిచిందని అంటున్నారు. మొత్తంగా ఫస్టాఫ్​ బాగా సాగిన సెకండాఫ్​ పర్వాలేదనిపించిందని పేర్కొంటున్నారు.

Vijay Beast review
విజయ్​ బీస్ట్​

కథేంటంటే.. వీర రాఘవ ఓ సీక్రెట్​ మిషన్​ను పూర్తిచేసేందుకు నగరానికి వస్తాడు. మిషన్​లో భాగంగా ఓ షాపింగ్​ మాల్​కు వెళ్లగా.. ఆ షాపింగ్​ మాల్​నే టెర్రరిస్టులు హైజాక్​ చేస్తారు. తమ డిమాండ్స్​ తీర్చాలని ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. అంతలోనే ఆ షాపింగ్​ మాల్​లో ఓ సీక్రెట్​ ఏజెంట్(వీర రాఘవన్​)​ ఉన్నాడని తెలియడం వల్ల.. ప్రభుత్వం అతడి ద్వారా ఓ సీక్రెట్​ రెస్క్యూ ఆపరేషన్​ను మొదలుపెడుతుంది. అసలు ఆ ఉగ్రవాదుల డిమాండ్స్​​ ఏంటి? రాఘవన్​.. టెర్రరిస్టులతో ఎలా పోరాడారు? చివరికి వారిని ఎలా మట్టుబెట్టి అక్కడి ప్రజలను కాపాడారు? అనేది కథాంశం.. అని సినిమా చూసిన వారు సోషల్​మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

నటీనటులు ఎలా చేశారంటే?.. విజయ్​ నటన గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. ఇలాంటి నేపథ్యంతో తెరకెక్కిన సినిమాల్లో ఆయన నటించడం కొత్తేమి కాదు. రాఘవన్​ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన లుక్స్ ఫ్యాన్స్​ను బాగా ఆకట్టుకున్నాయి. పూజాహెగ్డే పాత్రకు పెద్దగా స్కోప్​ లేదని తెలిసింది. పూర్తిగా యాక్షన్​ థ్రిల్లర్​గా కథ సాగడం వల్ల కామెడీ స్థాయి పెద్దగా లేదు. కమెడియన్​ యోగిబాబు తన పాత్రకు న్యాయం చేశారు. దర్శకుడు ​నెల్సన్​ దిలీప్​ కుమార్​ టేకింగ్​ బాగుంది. అనిరూధ్​ మ్యూజిక్​ సినిమాకు వెన్నెముకగా నిలిచింది.

  • #BeastFDFS [4.5/5] : "India's Biggest Action Thriller " - In every sense of the word..
    Thalapathy 😍😍 #Vijay 𓃵 swag max carries the movie on his shoulders from start to finish.

    Action sequences - On par with Hollywood / International Standards.#beast #Beastmovie

    — RCB BOY (@iamSRKmania) April 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: పెళ్లి దుస్తుల్లో ఆలియా ఎంత అందంగా ఉందో..

Last Updated : Apr 13, 2022, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.