ETV Bharat / entertainment

వరుణ్​ తేజ్​ 'ఆపరేషన్​ వాలెంటైన్'​- కొత్త లుక్​తో ఆకట్టుకుంటున్న మెగాప్రిన్స్ - వరుణ్​ తేజ్​ కొత్త సినిమాలు

Varun Tej Operation Valentine Teaser : వరుణ్​ తేజ్​ -మానుషీ చిల్లర్​ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆపరేషన్​ వాలెంటైన్'. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం టీజర్​ను విడుదల చేసింది. ​

Varun Tej Operation Valentine Teaser
Varun Tej Operation Valentine Teaser
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 9:58 PM IST

Updated : Dec 18, 2023, 10:42 PM IST

Varun Tej Operation Valentine Teaser : డిఫరెంట్​ స్టోరీలతో సినీ ప్రియులను మెప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు మెగా ప్రిన్స్ వరుణ్​ తేజ్. ఈసారి ఎయిర్​ఫోర్స్ ఆఫీసర్​గా మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరుణ్​తేజ్​ ప్రధాన పాత్రలో దర్శకుడు శక్తి ప్రతాప్​ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆపరేషన్​ వాలెంటైన్'. మిస్​ యూనివర్స్ మానుషీ చిల్లర్​ ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్​కు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర బృందం ఫస్ట్​ స్ట్రైక్​ పేరుతో టీజర్​ను విడుదల చేసింది. మీరూ ఆ టీజర్ చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'మన ఎయిర్​ ఫోర్స్​ని ఇంకొక దేశంలోకి పంపించడమంటే అది యుద్ధాన్ని ప్రకటించటమే. ఆ తర్వాత ఇలా ప్రతికారం తీర్చుకుంటూ పోతే దేశాలు ఉండవు. బోర్డర్స్ మాత్రమే ఉంటాయి' అంటూ ఎయిర్​ఫోర్స్ ఆఫీసర్​ చెప్పే డైలాగ్​తో టీజర్​ మొదలవుతుంది. ఆ తర్వాత 'మన దేశం గాంధీజీతో పాటు సుభాష్​ చంద్రబోస్​ది కూడా అని వరుణ్​ తేజ్​ చెప్పే డైలాగ్​ టీజర్​కే హైలైట్​గా నిలిచింది. పాకిస్థాన్​లో ఉన్న టెర్రరిస్ట్​లను అంతమొదించడానికి ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ చేసే మిషనే ఆపరేషన్​ వాలెంటైన్​ అని అర్థమవుతుంది. ఆ మిషన్​ బాధ్యతలను అర్జున్​ దేవ్​ (వరుణ్​ తేజ్)కు అప్పగిస్తుంది ప్రభుత్వం. హీరోయిన్​ మానుషీ కూడా ఎయిర్​ఫోర్స్​లోనే రాడార్​ ఆఫీసర్​గా చేస్తుంటారు. ఈ టీజర్​లో ఉగ్రవాదులపై వైమానిక దాడులు విజువల్స్ అదిరిపోయాయి. బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ కూడా హైలైట్​గా నిలిచింది.

ఈ సినిమాతోనే శక్తి ప్రతాప్​ సింగ్ దర్శకుడిగా​ పరిచయం కానున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు మీర్​ సర్వర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్​ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్​తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. క్లాసిక్ మ్యూజిక్ సెన్సేషన్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో 2024 ఫిబ్రవరి 16న గ్రాండ్​గా విడుదల కానుంది. ఈ సినిమాతోనే వరుణ్​ తేజ్​ బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఓటీటీలో వరుణ్‌-లావణ్య పెళ్లి వీడియో - టీమ్​ క్లారిటీ!

Gandeevadhari Arjuna Movie Review : యాక్షన్ మోడ్​లో వరుణ్​ తేజ్​.. 'గాండీవధారి అర్జున' ఎలా ఉందంటే ?

Last Updated : Dec 18, 2023, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.