ETV Bharat / entertainment

వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం డేట్​ ఫిక్స్​.. అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ - వరుణ్ తేజ్​ లావణ్య త్రిపాఠి ఎంగేజ్​మెంట్​

Varun tej marriage : హీరో వరుణ్​ తేజ్​ పెళ్లి పీటలెక్కబోతున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం గురించి అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు!

వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం డేట్​ ఫిక్స్​.. అఫీషియల్​ అనౌన్స్​మెంట్​

author img

By

Published : Jun 8, 2023, 12:02 PM IST

Updated : Jun 8, 2023, 12:21 PM IST

Varun tej marriage : మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. నటుడు నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహమాడనున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని వరుణ్​ టీమ్​ అధికారికంగా ప్రకటించింది! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమాని సంఘానికి చెందిన శివ చెర్రీ అనే వ్యక్తి ఈ పోస్ట్ చేశాడు. కంగ్రాట్యులేషన్స్ టు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి అంటూ ఇన్విటేషన్​ కార్డుని పోస్ట్ చేశాడు. టూ హార్ట్స్ వ‌న్ ల‌వ్ అంటూ క్యాప్ష‌న్ ఉన్న ఈ కార్డుపై వ‌రుణ్‌తేజ్ భుజంపై లావ‌ణ్య త్రిపాఠి వాలిపోయి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. దీంతో మెగా అభిమానులంతా వరుణ్​ పెళ్లి గురించి ఒక క్లారిటీకి వచ్చేశారు. ఇకపోతే కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు సమాచారం అందింది. ఈ ఏడాది చివర్లో ఈ జంట పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

అప్పటి నుంచే ప్రేమలో.. కాగా, వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి కలిసి గతంలో 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాల్లో నటించారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారిందట. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగుతూ వచ్చింది. చాలా సార్లు వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. కానీ దీని గురించి మెగా ఫ్యామిలీలో ఎవ్వరూ స్పందించలేదు. ఇక ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ అధికారికంగా ప్రకటించారు. వరుణ్‌-లావణ్యల ప్రేమ నిజమని క్లారిటీ చేశారు.దీంతో నెటిజన్లు, మెగా అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

సినిమాల విషయానికొస్తే.. లావణ్య త్రిపాఠి కెరీర్ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నడవట్లేదు. చివరిగా ఆమె నటించిన 'హ్యాపీ బర్త్ డే' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. తమిళంలో ఓ సినిమా చేస్తోంది. రీసెంట్​గా ఆమె నటించిన 'పులి మేక' అనే వెబ్ సిరీస్ రిలీజైంది. కానీ ఇది కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్​గా నటించింది. ఇక వరుణ్ తేజ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్​ సరసన సాక్షి నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. దీంతోపాటే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్​తోనూ ఓ సినిమా చేస్తున్నారు వరుణ్​.

ఇదీ చూడండి :

NBK 108 టైటిల్ వచ్చేసిందోచ్​.. గిప్పడి సంది ఖేల్ అలగ్!

'లస్ట్​ స్టోరీస్​ 2' బ్యూటీస్​ స్టైలిష్​ ఫొటోషూట్​.. మృణాల్​ ఓపెన్​ హార్ట్​ షో హైలైట్​!

Last Updated : Jun 8, 2023, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.