Varun Tej Lavanya Tripathi Marriage : మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగే క్షణాలు దగ్గరికి వచ్చేశాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా జూన్ 9వ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. మెగాబ్రదర్ నాగబాబు ఇంట్లో ఈ నిశ్చితార్థం వేడుక గ్రాండ్‌గా జరిగింది.
అయితే అప్పటినుంచి వరుణ్-లావణ్య పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతుందనే విషయంపై మెగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ పెళ్లి వివరాల గురించి రోజుకో వార్త కూడా బయటకు వస్తూనే ఉంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని కూడా అంటున్నారు.
Varun Tej Lavanya Tripathi Wedding Venue : ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరగనున్నట్లు ఆ మధ్య ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం తన ప్రేమ చిగురించిన చోటు ఇటలీలోనే జరగనుందట. నవంబరు నెలలో ఈ పెళ్లి జరగనుందని తెలిసింది. నవంబర్ 1వ తేదీని లాక్ చేసినట్లు తెలిసింది. ఇరు కుటుంబల సమక్షంలో మూడు రోజుల పాటు డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరగనున్నట్లు సమాచారం అందింది. ఈ వేడుక కోసం మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్లనున్నారట. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం ఒక్కరే బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాకపోవచ్చని సమాచారం అందింది.
ఇకపోతే వరుణ్ తేజ్.. ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మరో మూడు రోజుల్లో ఆగస్ట్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. సినిమాలో వరుణ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. దాదాపు రూ.50కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించారని తెలిసింది. ఈ చిత్రం హిట్ కావడం అటు ప్రవీణ్ సత్తారు ఇటు వరుణ్ తేజ్‌కు ఎంతో ముఖ్యం. చూడాలి మరి ఏం జరుగుతుందో...