ETV Bharat / entertainment

Ghani trailer: 'నీకు భయంపుట్టేలా చేస్తా'.. 'గని' యాక్షన్​ ట్రైలర్​ - vishal new movie

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గ‌ని' సినిమా యాక్షన్​ ట్రైలర్​ విడుదలైంది. పంచ్​ డైలాగ్​లు, యాక్షన్​తో ఆకట్టుకుంది. అలాగే.. విశాల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ 'లాఠీ' సినిమా ఫస్ట్​ లుక్​ వచ్చేసింది.

ghani
గని
author img

By

Published : Apr 6, 2022, 10:38 PM IST

Updated : Apr 7, 2022, 6:54 AM IST

వ‌రుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం 'గ‌ని'. బాక్సింగ్​ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకుడు. ఈ మూవీ యాక్ష‌న్‌ ట్రైల‌ర్​ను చిత్ర బృందం బుధవారం విడుద‌ల చేసింది. బాలీవుడ్ బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఏప్రిల్ 8న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌వుతోంది గ‌ని.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'జీవితంలో కొన్ని ప్ర‌శ్న‌లు అలాగే ఉండిపోయాయి. వాట‌న్నింటికీ స‌మాధానం ఒక్క‌టే' అని వ‌రుణ్ తేజ్ చెబుతున్న సంభాష‌ణల‌తో షురూ అయింది యాక్ష‌న్ ట్రైల‌ర్‌. 'రాసిపెట్టుకో నా ప్రతి గెలుపుతో నీకు భయంపుట్టేలా చేస్తా’ డైలాగ్​ ట్రైలర్​లో హైలెట్​గా నిలిచింది. 'ఆ రోజు నువ్వు ట‌చ్ చేసింది న‌న్ను కాదు.. నా ఈగోని' అని న‌వీన్ చంద్ర చెప్పే డైలాగ్స్.. హీరో, విల‌న్ మ‌ధ్య పోరు చాలా స్ట్రాంగ్‌గా ఉండ‌బోతుంద‌ని స్పష్టం చేశాయి.

సాలిడ్​గా విశాల్​..

vishal
విశాల్​

విశాల్ కథానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ 'లాఠీ'. విశాల్ ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్​ని బుధవారం విడుదల చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం ముందు సాలిడ్ గా నిలబడి, ఒక చేతిలో లాఠీ పట్టుకుని, మరో చేతికి బ్యాండేజీ కట్టుతో ఈ ఫస్ట్ లుక్ లో విశాల్ కనిపించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో టాప్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణలో ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

కోలీవుడ్‌ యంగ్‌ హీరో విష్ణు విశాల్‌ కథానాయకుడిగా మను ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్‌ఐఆర్‌'. విష్ణు విశాల్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఫిబ్రవరి 11న విడుదలై మంచి పాజిటివ్‌ టాక్‌ సంపాందించుకుంది. మాస్‌ మహారాజ రవితేజ సమర్పణలో అభిషేక్‌ నామా ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. రవితేజ సమర్పణలో విష్ణు విశాల్‌ మరో సినిమా రానుంది. రవితేజ సమర్పణలో విష్ణు విశాల్‌ 'మట్టి కుస్తీ' అంటూ క్రీడా నేపథ్యంలో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి: ఈ భామల కాల్షీట్లు ఫుల్​.. ఇక సెట్​లో హీరోలతోనే..

Last Updated : Apr 7, 2022, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.