ETV Bharat / entertainment

ఆ సినిమా రిలీజ్​ కాకముందే.. 30కోట్లు లాభం?

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ దళపతి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో "వారసుడు" సినిమా రాబోతోంది. అయితే ఈ చిత్రానికి నిర్మాతగా దిల్​రాజు నిర్మిస్తున్నారు. విడుదలకు ముందే ఆ సినిమాకి 30 కోట్లు లాభం వచ్చిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ కథేంటంటే..?

దిల్​రాజ్​ విజయ్​ దళపతి
dillraj and vijay
author img

By

Published : Oct 30, 2022, 10:31 PM IST

తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడు విజయ్​ దళపతి అంటే తెలియనివారు ఎవరు ఉండరు. ఆయనకి అంత క్రేజ్​ ఉంది మరి.. విజయ్​ నటన, డ్యాన్స్​ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అటు తమిళంతో పాటు, ఇటూ తెలుగు ఇండస్ట్రీలోను తనదైన ముద్ర వేసుకున్నారు విజయ్. ప్రసుతం ​దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మిస్తున్న సినిమా 'వారసుడు'లో హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో 'వారిసు' పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్​రాజు, శిరీష్.. పీవీపీ పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే అసలు విషయం ఎంటంటే?.. ఈ సినిమాతో విడుదలకు ముందే దిల్​రాజు అండ్ కో 30 కోట్లు లాభం పొందారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

కళ్ళు చెదిరేలా 'వారసుడు' ప్రీ రిలీజ్ బిజినెస్
తమిళ్​తో పాటు తెలుగులో విజయ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్​ ఉంది. బాక్సాఫీసుల్లో ఆయన సినిమాలు వందకోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. అందుకోసం, తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియో రూ. 72 కోట్ల నుంచి రూ. 75 కోట్ల మధ్య సొంతం చేసుకుందట. ఓవర్సీస్ రిలీజ్ రైట్స్‌ను రూ. 38 కోట్లకు ఫార్స్ ఫిలిమ్స్ సొంతం చేసుకుందని సమాచారం. డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయ్యిందని.. తెలుగు, తమిళ భాషల హక్కులను సుమారు 150 కోట్లకు అటు ఇటుగా అమ్మేశారని ప్రచారం జరుగుతోంది. ఆడియో రైట్స్ టీ సిరీస్ తీసుకుంది. ఐదు కోట్లకు ఆ డీల్ కుదిరిందని బాలీవుడ్ టాక్.

తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా 'వారసుడు' మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు 280 కోట్లకు ఇచ్చేశారట. సినిమా నిర్మాణానికి సుమారు 250 కోట్లు అవుతోందని వినబడుతోంది. ఆ లెక్కన విజయ్ సినిమాతో దిల్​రాజుకు 30 కోట్లు లాభమే. అది కాకుండా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. ఎటు చూసినా దిల్ రాజు మంచి లాభం అందుకుంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్.

తెలుగు సినిమా కాదు.. తమిళ చిత్రమే!
'వారసుడు' సినిమాను తొలుత తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. తెలుగులో షూటింగ్ ఆపేసినప్పుడు ఆ సినిమా షూటింగ్ చేయడం గురించి చర్చనీయాంశం అయ్యింది. అప్పుడు తమది తమిళ సినిమా అని పేర్కొన్నారు. ఆ తర్వాత 'బీస్ట్' విడుదల సమయంలో కూడా విజయ్ తమిళంలో తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఇటీవల దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా అదే మాట చెప్పారు.

విజయ్ సరసన రష్మిక మందన నటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఇందులో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చదవండి:ప్రముఖ నటి ఇంట చోరీ.. దీపావళికి వెళ్లి వచ్చేలోపు ఇల్లంతా ఊడ్చేశారు!

మన హీరోయిన్లంతా ఆ ఫోబియోలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.