Vaishnav Tej: "నన్నే చూస్తావ్.. నా గురించే కలలు కంటావ్.. కానీ, నీకు నాతో మాట్లాడటానికి ఇగో" అని హీరో వైష్ణవ్ తేజ్‌ని ఉద్దేశించి అంటున్నారు నటి కేతికాశర్మ. వీరిద్దరూ కలిసి నటించిన లవ్లీ చిత్రం 'రంగ రంగ వైభవంగా'. గిరీశాయ దర్శకుడు. సోమవారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చక్కటి ప్రేమకథతో సిద్ధమైన ఈ సినిమాలో వైష్ణవ్ రిషిగా, కేతిక రాధగా నటించారు. వీళ్లిద్దరూ తరచూ గొడవలు పడటం.. ఇగోతో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను బయటపెట్టకపోవడం.. ఇలా పలు సన్నివేశాలు చూస్తే పవన్‌కల్యాణ్ నటించిన యూత్‌ఫుల్ సినిమా 'ఖుషి' గుర్తుకు వస్తుంది. టీజర్ చివర్లో వచ్చే డైలాగ్‌లు యువతను అలరించేలా ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ దీన్ని నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టీజర్ లాంఛ్ కార్యక్రమంలో భాగంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం ఇచ్చిన సమాధానాలివే..
ఈ టీజర్ చూస్తుంటే మాకు 'ఖుషి' గుర్తుకువచ్చింది. మీరు పవన్‌కల్యాణ్ ఫ్యానా?
గిరీశాయ: అవునండి. పవన్‌కి నేను పెద్ద అభిమానిని. 'ఖుషి' చిత్రాన్ని భీమవరం విజయలక్ష్మి థియేటర్‌లో 38 సార్లు చూశా. నేను ఇప్పటివరకూ ఎక్కువసార్లు చూసిన సినిమా అదే.
పోలీస్, యాక్షన్ కథా చిత్రాల్లో మీరు నటిస్తారా?
వైష్ణవ్‌తేజ్: అవకాశం వస్తే తప్పకుండా చేస్తా.
చిన్నప్పుడు మీరేం కావాలని కలలు కన్నారు?
వైష్ణవ్: శాస్త్రవేత్తను కావాలనుకున్నా. అబ్దుల్‌కలాం గారు నాకెంతో స్ఫూర్తి. బైపీసీ వరకూ చదివాను. దాని తర్వాత కుదరలేదు.
కేతిక: నేను డాక్టర్స్ కుటుంబం నుంచే వచ్చాను. నా తల్లిదండ్రులు నన్నూ ఓ డాక్టర్‌గా చూడాలనుకున్నారు. కానీ నేను నటిని కావాలనుకుంటున్నానని చెప్పాను. వాళ్లు సపోర్ట్ చేశారు.
ఈ సినిమాలోని ఏ సన్నివేశాన్ని చూసి ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు?
వైష్ణవ్: సత్య కామెడీ సీన్స్ నా ఫేవరెట్. ఈసినిమాకు ఆయన కామెడీ ఎపిసోడ్ హైలైట్.
మీరు ముందే ఎందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు?
వైష్ణవ్ తేజ్: నేను సరైన వయసులో పరిశ్రమలోకి వచ్చాననుకుంటున్నా. 25, 26 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చాను. అయినా నేను సినిమాల్లోకి రావాలని అస్సలు అనుకోలేదు. ఇన్‌స్టాలో ఏదో ఫొటో పెడితే అది చూసి బుచ్చిబాబు ఓకే చేయడంతో 'ఉప్పెన'లో నటించా. ఆ సినిమా అప్పుడు నా వయసు 25.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఆ పాత్ర చేయండి ప్లీజ్.. రూ.2355కోట్లు ఇస్తాం'.. జానీడెప్కు డిస్నీ జాక్‌పాట్?