ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ఓజీ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. మూవీ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. షూట్ బిగిన్స్ అంటూ అందులో ఉంది. ఈ 'పవర్ స్టార్మ్ ఈజ్ కమింగ్' అంటూ సాగే పాటకు పవర్ఫుల్ బీజీఎమ్ ఇచ్చారు. సాహో సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైనమెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. పవర్ స్టార్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ ఆడిపాడనుంది. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా రవి కె చంద్రన్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ముంబయిలో మొదలు పెట్టినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా శనివారం గ్లింప్స్ వీడియో విడుదల చేసింది. వచ్చే వారం పవన్ కల్యాణ్ షూటింగ్లో పాల్గొంటారని సినిమా యూనిట్ ప్రకటించింది. ముంబయిలో జరుగుతున్న మొదటి షెడ్యూల్లో పవన్‌తో పాటు హీరోయిన్ ప్రియాంక మోహన్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారని సమాచారం. ఐదు రోజుల పాటు పవన్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'ఓజీ' వర్కింగ్ టైటిల్‌తో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవర్ స్టార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారట. మాఫియా డాన్స్ అందరూ పవన్‌ను చూసి భయపడే సీన్స్ ఈ సినిమాలో ఉన్నట్లు సమాచారం. అయితే, ముందు పవన్‌కు ఓ రీమేక్ కథ వినిపించారని అప్పట్లో చర్చ జరిగింది. ఆ తర్వాత సుజిత్ చెప్పిన స్టోరీ నచ్చడం వల్ల.. ఆ కథకే పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, డీవీవీ నిర్మాణ సంస్థలో పవన్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ బ్యానర్లో పవర్ స్టార్ తొలి చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. ఈ సినిమా తర్వాత పదేళ్లకు మళ్లీ అదే బ్యానర్లో సినిమా చేస్తున్నారు.
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న పవర్ స్టార్.. టైట్ షెడ్యూల్లోనూ షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. 'ఓజీ' మొదటి షెడ్యూల్ పూర్తైన తర్వాత.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'హరిహర వీరమల్లు' షూటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత 'గబ్బర్ సింగ్' డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్లో పాల్గొంటారు.