ETV Bharat / entertainment

Upcoming OTT Movies And Web Series : రెండు వారాల్లోనే ఓటీటీకి సుధీర్​ బాబు సినిమా.. ఈ వారం ఓటీటీలో ఏం నడుస్తోందంటే? - ott movies and web series

Upcoming OTT Movies And Web Series : ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమా స్ట్రీమింగ్‌ కానుందో ఓ సారి చూసేయండి.

Upcoming OTT Movies And Web Series
Upcoming OTT Movies And Web Series
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 8:00 PM IST

Upcoming OTT Movies And Web Series : ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్‌లో పలు ఆసక్తికర చిత్రాలు సందడి చేస్తున్నాయి. లియో, భగవంత్ కేసరి లాంటి సినిమాలతో పాటు మరిన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమా స్ట్రీమింగ్‌ కానుందో ఓ సారి చూసేయండి.

నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలకపాత్రలో నటించిన ఓ సరికొత్త వెబ్‌సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మాన్షన్‌ 24' అనే పేరుతో రూపొందిన ఈ సిరీస్​కు ఓంకార్‌ దర్శకత్వం వహించారు. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇక థియేటర్లలో విడుదలైన రెండువారాల్లోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది 'మామా మశ్చీంద్ర' సినిమా. సుధీర్‌ బాబు లీడ్​ రోల్​లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 6న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే 'ఆహా' వేదికగా ఈ నెల 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

సంజయ్‌ సూరి, ప్రియమణి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌ 'సర్వం శక్తిమయం'. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్‌ 20 నుంచి 'ఆహా' వేదికగా స్ట్రీమ్​ కానుంది. అష్టాదశ శక్తిపీఠాల దర్శనంతో సాగే ఈ ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌లో అష్టాదశ శక్తి పీఠాలంటే ఏమిటి? వాటి విశిష్టత..? వంటి ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్‌ సాగనుందని ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సిరీస్​కు ప్రదీప్‌ దర్శకత్వం వహించారు.

సీనియర్​ నటులు రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్‌ మదిరాజు రూపొందించిన లేటెస్ట్ మూవీ '#కృష్ణారామా'. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అనన్య శర్మ, చరణ్‌ లక్కరాజు, రవి వర్మ, జెమిని సురేశ్‌, రచ్చ రవి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇక 'ఈటీవీ విన్‌' వేదికగా ఈ సినిమా అక్టోబర్​ 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • సింగపెన్నే (తమిళ చిత్రం) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • బాడీస్‌ (వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • కందసామీస్‌: ద బేబీ (ఇంగ్లీష్‌ మూవీ) అక్టోబరు 20
  • నియో (వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ఓల్డ్‌ డాడ్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 20
  • డూనా (కొరియన్‌ సిరీస్‌) అక్టోబరు 20

అమెజాన్‌ ప్రైమ్‌

  • అప్‌లోడ్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 20
  • పర్మినెంట్‌ రూమ్మేట్స్‌ (హిందీ సిరీస్‌) స్ట్రీమింగ్ అవుతోంది.
  • ది అదర్‌ జోయ్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 20
  • ట్రాన్స్‌ఫార్మర్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 20
  • అప్‌లోడ్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 20

ఆహా

  • రెడ్‌ శాండల్‌ వుడ్‌ (తమిళ చిత్రం) అక్టోబరు 20

బుక్‌ మై షో

  • ది నన్‌2 (హాలీవుడ్‌) అక్టోబరు 19
  • మై లవ్‌ పప్పీ (కొరియన్‌ సిరీస్‌) అక్టోబరు 20

లయన్స్‌ గేట్‌ ప్లే

  • మాగీ మూర్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 20
  • హైరిచ్‌
  • ఒరు థుళ్లి థాప్పా (మలయాళం) అక్టోబరు 20

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.