ETV Bharat / entertainment

ఉపాసన ఇంట్లో విషాదం... ధైర్యం చెబుతున్న మెగా ఫ్యాన్స్​! - ఉపాసన ఎమోషనల్​ పోస్ట్​

మెగా కోడలు ఉపాసన ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె సోషల్​మీడియా ద్వారా ఓ ఎమోషనల్​ పోస్ట్ పెట్టారు.దీంతో మెగా ఫ్యాన్స్​ ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

Upasana grand mother died
ఉపాసన ఇంట్లో విషాదం... ధైర్యం చెబుతున్న మెగా ఫ్యాన్స్​!
author img

By

Published : Jan 23, 2023, 12:11 PM IST

Updated : Jan 23, 2023, 12:39 PM IST

మెగా కోడలు ఉపాసన.. ప్రస్తుతం మాతృత్వ క్షణాలను ఆస్వాదిస్తోంది. ఉపాసన-రామ్‌ చరణ్‌ల పెళ్లైన పదేళ్లకు సంతానం కలగబోతుండడంతో.. అటు కొణిదెల, ఇటు కామినేని కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఉపాసన తన పుట్టింట్లోనూ సరదాగా గడుపుతోంది. ఇక ఇదే సమయంలో ఆర్​ఆర్​ఆర్​కు అంతర్జాతీయ అవార్డులు రావడం ఈ ఇరు కుటుంబాల్లో సంతోషాన్ని మరింత రెట్టింపు చేశాయి.

ఇలా వరుసగా శుభవార్తలు వస్తున్న నేపథ్యంలో ఉపాసన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఉపాసన గ్రాండ్‌ మదర్‌ పుష్నాని కన్నుమూశారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేశారు. "ఆమె చివరి వరకు ఎంతో కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు. ఆమె ద్వారానే జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకున్నాను. ఆమె నన్ను పెంచి పెద్ద చేసింది. తన ప్రేమ‌ను నేను ఎప్ప‌టికీ మర్చిపోలేను. నేను నా గ్రాండ్‌ పేరెంట్స్‌ దగ్గర నుంచి ఎలాంటి ప్రేమానురాగాలను పొందానో.. వాటిని నా పిల్లలకు అందేలా చూస్తానని మాటిస్తున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి" అంటూ ఉపాసన భావోద్వేగానికి గురయ్యారు. దీంతో మెగా అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు!

ఇదీ చూడండి: చేతిలో గ్లాస్​.. పక్కన హనీ రోజ్​.. పోజు అదిరిందయ్య బాలయ్య!

Last Updated : Jan 23, 2023, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.