UK Movie Festival Mutthayya Movie: భారీ బడ్జెట్ చిత్రాలే కాదు, అప్పుడప్పుడు కొన్ని చిన్న చిత్రాలు కూడా అరుదైన ఘనత సాధిస్తున్నాయి. అలాంటి కోవలోకే వస్తుంది 'ముత్తయ్య'. కె.సుధాకర్‌రెడ్డి కీలక పాత్రలో భాస్కర్ మౌర్య దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. తాజాగా ఈ సినిమా యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. మే 9న ఈ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా అగ్ర కథానాయిక కాజల్ 'ముత్తయ్య' సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా తెర ముందు ఓ వృద్ధుడిని నిలబడి చూస్తున్న పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది. అరుణ్ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగమ్‌శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను సమర్పిస్తుండగా, వ్రింద ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Nagachaitanya Webseries Amazon Prime: హీరో నాగచైతన్య ఈ ఏడాది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ కథాంశంతో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సిరీస్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నాగచైతన్య కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దాదాపు ఎనిమిది నుంచి పది ఎపిసోడ్లుగా ఈ సిరీస్ తెరకెక్కించునున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు 'దూత' అనే పేరును ఖరారు చేశారు.
-
#DhoothaOnPrime: In this supernatural horror, possessed inanimate objects wreak havoc on the lives of people who commit deadly sins.#PrimeVideoPresentsIndia #SeeWhereItTakesYou pic.twitter.com/7lNDbdpTER
— amazon prime video IN (@PrimeVideoIN) April 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#DhoothaOnPrime: In this supernatural horror, possessed inanimate objects wreak havoc on the lives of people who commit deadly sins.#PrimeVideoPresentsIndia #SeeWhereItTakesYou pic.twitter.com/7lNDbdpTER
— amazon prime video IN (@PrimeVideoIN) April 28, 2022#DhoothaOnPrime: In this supernatural horror, possessed inanimate objects wreak havoc on the lives of people who commit deadly sins.#PrimeVideoPresentsIndia #SeeWhereItTakesYou pic.twitter.com/7lNDbdpTER
— amazon prime video IN (@PrimeVideoIN) April 28, 2022
ఇదిలా ఉండగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకున్నట్లు తెలిసింది. తాజాగా ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని, అతి త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో నాగచైతన్యకు జోడీగా ప్రియాభవానీ శంకర్ నటిస్తున్నారు. కెరీర్‌లో నాగచైతన్య అంగీకరించి తొలి హారర్ కథాంశమిదే కావడం గమనార్హం.
Nityamenon New Youtube Channel: 'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్. నటించనవి తక్కువ సినిమాలే అయినా అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నిత్య.. రీసెంట్‌గా భీమ్లా నాయక్ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ భామ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'నిత్య అన్‌ఫిల్టర్డ్'(Nithya Unfiltered)పేరుతో యూట్యూబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన 12ఏళ్ల సినీ కెరీర్‌కి సంబంధించిన విషయాలను మొదటి వీడియోలో షేర్ చేస్తూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవిత విశేషాలపై మరిన్ని వీడియోలతో త్వరలోనే మీ ముందుకు రాబోతున్నానంటూ పేర్కొన్నారు. ఇక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కొద్దిసేపటికే వేలమంది ఫాలోవర్లు వచ్చిచేరారు.
ఇవీ చదవండి: 'సర్కారు వారి పాట' ట్రైలర్ అప్డేట్.. 'సమ్మతమే' రిలీజ్ డేట్ ఫిక్స్
'సామ్.. ఏం మాయ చేశావో'.. అంటూ స్టార్ హీరో బర్త్‌డే విషెస్!