UI The Movie Teaser :కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'యూఐ: ది మూవీ'. ఈ సినిమా టీజర్‌ను వినాయకచవితి సందర్భంగా చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల టీజర్, ట్రైలర్ రిలీజ్ అంటే భారీ అంచనాలు పెట్టుకుంటారు ఫ్యాన్స్. దీనికి తగ్గట్టే అటు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా వీటిల్లో సినిమాపై హైప్ క్రియేట్ చేసే విధంగా ఉండే డైలాగ్స్, సీన్స్ ఉండేలా చూసుకుంటారు.
కానీ, హీరో కమ్ డైరెక్టర్‌గా మారిన ఉపేంద్ర మాత్రం తన అప్‌కమింగ్ మూవీ 'UI'టీజర్‌లో మాత్రం అవేవీ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2 నిమిషాల 17 సెకన్ల నిడివి గల ఈ టీజర్ ప్రస్తుతం ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక్కటంటే ఒక్క విజువల్ కూడా లేకుండానే ఈ విచిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ వీడియోలో కేవలం సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. దీంతో కళ్లు మూసుకొని కూడా ఈ టీజర్‌ను చూడవచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మీ ఊహకు తగ్గట్లు టీజర్!
అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్‌లో మొత్తంగా విజువల్స్ లేకపోవడం గమనార్హం. ఈ మొత్తం వీడియోలో వింత వింత శబ్దాలతో పాటు ఉపేంద్ర బోల్డ్ వాయిస్ మాత్రమే ఉంది. దీంతో కళ్లు మూసుకొని టీజర్ వింటే మంచి అనూభూతి చెందవచ్చు. ఎందుకంటే కళ్లు మూసుకొని టీజర్‌లో వచ్చే శబ్దాలు వినడం వల్ల ఎవరి ఊహకు తగ్గట్లు వారు సీన్స్‌ను విజువలైజ్ చేసుకుంటారు. ఇలాంటి టీజర్ మాత్రం ఇప్పటివరకు చూడలేదని.. టీజరే ఇలా టీజ్ చేసే విధంగా ఉందంటే సినిమా ఇంకా ఎలా ఉంటుందో అని కొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
'ఇది ఏఐ కాదు.. యూఐ'..!
'చీకటి.. అంతా చీకటి..' అంటూ ఉపేంద్ర వాయిస్‌తో మొదలైన టీజర్‌లో శబ్దాలు మాత్రమే వినిపించాయి. 'ఇది ఏఐ వరల్డ్ కాదు. ఇది యూఐ వరల్డ్. దీని నుంచి తప్పించుకోవాలంటే మీ తెలివితేటలను ఉపయోగించండి' అంటూ ఉన్న ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం సహా హిందీ భాషల్లో విడుదల కానుంది.
-
UI Teaser Links
— Upendra (@nimmaupendra) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Kannada: https://t.co/xGVJe244Yu
Hindi: https://t.co/HkE6duEECr
Telugu: https://t.co/iTJCu2VCTz
Tamil: https://t.co/XbiYZyoYel
Malayalam: https://t.co/mFV5wohsPZ pic.twitter.com/zBqbxuGb9B
">UI Teaser Links
— Upendra (@nimmaupendra) September 18, 2023
Kannada: https://t.co/xGVJe244Yu
Hindi: https://t.co/HkE6duEECr
Telugu: https://t.co/iTJCu2VCTz
Tamil: https://t.co/XbiYZyoYel
Malayalam: https://t.co/mFV5wohsPZ pic.twitter.com/zBqbxuGb9BUI Teaser Links
— Upendra (@nimmaupendra) September 18, 2023
Kannada: https://t.co/xGVJe244Yu
Hindi: https://t.co/HkE6duEECr
Telugu: https://t.co/iTJCu2VCTz
Tamil: https://t.co/XbiYZyoYel
Malayalam: https://t.co/mFV5wohsPZ pic.twitter.com/zBqbxuGb9B
- " class="align-text-top noRightClick twitterSection" data="">