మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ నిర్మించిన చిత్రం నువ్వేనువ్వే. తరుణ్, శ్రియా జంటగా ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. సెంటిమెంటల్గానూ, కామెడీ పరంగానూ ప్రేక్షకుల మెప్పును పొందడమే కాకుండా.. అవార్డులు సైతం సొంతం చేసుకున్న చిత్రంగా 'నువ్వే నువ్వే' నిలిచింది. తరుణ్, శ్రియ నటన, ప్రకాష్ రాజ్ తండ్రి సెంటిమెంట్‌తో పాటు సునీల్ స్పాంటేనియస్ డైలాగ్స్ ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలిచాయి.
అయితే సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఏఎంబీ మాల్ లో నువ్వే నువ్వే ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ తోపాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరై సందడి చేశారు. నువ్వే నువ్వే చిత్రీకరణ అనుభవాలను, ఆ సినిమా పంచిన అనుభూతులను గుర్తుచేసుకున్నారు. నువ్వే నువ్వే చిత్రాన్ని సిరివెన్నెలకు నివాళిగా అంకితమిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. అయితే అందురూ మెచ్చిన ఈ సినిమాలో సునీల్ కామెడీ డైలాగ్స్‌తో అందరిని నవ్విస్తే.. ప్రకాష్ రాజ్ నాన్న పాత్రలో చెప్పే డైలాగ్స్ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించాయి.. ఇలా త్రివిక్రమ్ పెన్ నుంచి జాలువారిన ఒక్కో డైలాగ్స్ ఇప్పటికి అందరి నోళ్లలో నానుతూనే ఉన్నాయి.
దాదాపు రెండు దశాబ్దాలు పుర్తి చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీలోని కొన్ని ఫేమస్ డైలాగ్స్ మీ కోసం...
- డబ్బుతో బ్రెడ్ కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ కొనగలరు, నిద్రని కొనలేరు.
- ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు... ఎలా వెళ్లాలో చెప్పడానికి నేనెవర్ని?
- మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్లు. మనం ఏం చేసినా భరించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు.
- నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20 నాకు, 80 వాడికి. ఇంకో పదిహేను మార్కులు వేసి మీ నాన్నను పాస్ చేయలేవమ్మా?
- అమ్మ, ఆవకాయ్, అంజలి... ఎప్పుడూ బోర్ కొట్టవు.
- కన్నతల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరకు రావాలని కోరుకోవడం మూర్ఖత్వం.
ఇవీ చదవండి : బాలీవుడ్‌లోకి స్టార్ క్రికెటర్ ఎంట్రీ.. ఆ సినిమాతోనే