ETV Bharat / entertainment

బాలీవుడ్​లో త్రిష రీ ఎంట్రీ!- సల్మాన్​తో స్క్రీన్ షేరింగ్ నిజమేనా? - త్రిష బాలీవుడ్​ సినిమాలు

Trisha Salman Khan: సీనియర్ హీరోయిన్ త్రిష దాదాపు 13 ఏళ్ల తర్వాత బాలీవుడ్​లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెెలుస్తోంది. ఆమె స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్​గా మెరవనుందట.

Trisha Salman Khan
Trisha Salman Khan
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 6:47 AM IST

Updated : Jan 1, 2024, 7:42 AM IST

Trisha Salman Khan: సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కెరీర్​లో జోరు పెంచింది. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. పొన్నియిన్ సెల్వన్- 2, ది రోడ్, లియో చిత్రాల్లో లీడ్ రోల్​లో నటించి విజయాలు అందుకుంది. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా గడుపుతోంది. అందులో ఓ మలయాళం సినిమా కూడా ఉంది.

ఈ భామ 13 ఏళ్ల తర్వాత బాలీవుడ్​లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజాగా పలు కథనాలు వస్తున్నాయి. కండల వీరుడు సల్మాన్ ఖాన్​తో ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు బీ టౌన్​లో టాక్ నడుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ విష్ణు వర్ధన్ తెరకెక్కిస్తున్న 'ది బుల్' సినిమాలో త్రిషను హీరోయిన్​గా అనుకున్నారట. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ పారామిలిటరీ ఆఫీసర్​గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానునందట. ఒకవేళ ఈ టాక్ నిజమైతే త్రిష బాలీవుడ్ రీ ఎంట్రీ కన్ఫార్మ్ అవుతుంది.

Trisha Bollywood: అయితే త్రిష 2010లోనే బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన 'ఖట్టా మీఠా' సినిమాలో నటించింది. ఆ తర్వాత హిందీలో పెద్దగా అవకాశాలు రాకపోవడం వల్ల త్రిష సౌత్ ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టింది.

KH 234: ప్రస్తుతం త్రిష 'కేహెచ్ 234' సినిమాతో బిజీగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్- ప్రముఖ దర్శకుడు మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీలో త్రిష లీడ్​ రోల్​లో నటిస్తోంది. భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం 'విశ్వంభర'లోనూ త్రిష నటించనుంది. బ్లాక్ బస్టర్ మూవీ బింబిసార డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలతో పాటు 'విదా ముయార్చి', 'ఐడెంటిటీ' సినిమాలు లైన్​లో ఉన్నాయి.

మెగాస్టార్​ సినిమాలో త్రిష! - 17 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్!

త్రిష పై 'లియో' నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు - కోలీవుడ్‌ ప్రముఖుల ఆగ్రహం- వివరణ ఇచ్చిన మన్సూర్!

Last Updated : Jan 1, 2024, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.