ETV Bharat / entertainment

అగ్ర హీరోల క్రేజీ ప్రాజెక్టులు.. జూన్​లో ముహూర్తాలు.. - ఎన్టీఆర్ న్యూస్

Tollywood News: టాలీవుడ్​ అగ్ర హీరోలు జూన్​లో క్రేజీ ప్రాజెక్టులను పట్టాలపైకి ఎక్కించనున్నారు. ఎన్టీఆర్-కొరటాల, మహేశ్-త్రివిక్రమ్​, పవన్​ కల్యాణ్​-సముద్రఖని సినిమాల షూటింగ్ ప్రారంభంకానుంది.

tollywood top heroes to begin new movies from june
అగ్ర హీరోల క్రేజీ ప్రాజెక్టులు
author img

By

Published : May 13, 2022, 7:57 AM IST

Tollywood top heroes: అగ్ర తారలు వరుసగా కొత్త సినిమాల కబుర్లు వినిపించనున్నారు. కరోనావల్ల ఎప్పట్నుంచో వాయిదా పడుతూ వచ్చిన సినిమాల విడుదలల గురించే మొన్నటి వరకూ ఎదురు చూశాం. కీలకమైన ఆ సినిమాలన్నీ ఒకొక్కటిగా విడుదలవుతూ వచ్చాయి. ఇక నుంచి కొత్త అధ్యాయాలు మొదలు కానున్నాయి. జూన్‌లోనే పలువురు అగ్ర కథానాయకులు సినిమాలకు కొబ్బరికాయ కొట్టనున్నారు.

ఎన్టీఆర్‌ - కొరటాల శివ కలయికలో తెరకెక్కనున్న సినిమా పనులు ఇప్పటికే ఊపందుకున్నాయి. ఎన్టీఆర్‌పై ఇటీవలే ఫొటోషూట్‌ చేశారు. ఎన్టీఆర్‌ పుట్టినరోజైన 20న ఆ సినిమాకి సంబంధించిన కొత్త కబురు వినిపించనున్నారు. హీరోయిన్‌ ఎవరనేది అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందనున్న చిత్రమూ జూన్‌లోనే షురూ కానుంది. ఆ విషయాన్ని మహేష్‌బాబు అధికారికంగా వెల్లడించారు. స్క్రిప్టు సిద్ధం కావడం మొదలుకొని, కథానాయిక ఎంపిక ఇప్పటికే పూర్తయింది. మహేష్‌ సరసన పూజాహెగ్డే నటించనున్న విషయం తెలిసిందే.

పవన్‌కల్యాణ్‌ - సముద్రఖని కలయికలో సినిమా వచ్చే నెలలోనే ప్రారంభం అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన ‘వినోదాయ సిద్ధం’ సినిమాకి రీమేక్‌గా ఆయనే పవన్‌తో సినిమా చేయనున్నారు. ఇందులో సాయి తేజ్‌ కీలక పాత్ర పోషించనున్నారు.

ఇదీ చదవండి: అనుష్క, సమంత, కీర్తి సురేష్‌ బాటలో యువ నాయికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.