ETV Bharat / entertainment

రీ రిలీజ్ ట్రెండ్​.. 4K వెర్షన్ ఖర్చు ఎంతో తెలుసా? - mosagallaku mosagadu rerelease

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రీ రిలీజ్​ ట్రెండ్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలకు క్వాలిటీ పెంచి ఇప్పుడు '4కే' వెర్షన్​లో విడుదల చేస్తున్నారు. అయితే 4కేలో మార్చడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

Re Release trend 4K Cost
రీ రిలీజ్ ట్రెండ్​.. 4K వెర్షన్ ఖర్చు ఎంతో తెలుసా?
author img

By

Published : May 23, 2023, 4:22 PM IST

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రీ రిలీజ్​ ట్రెండ్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మళ్లీ సందడి చేస్తున్నాయి. అయితే పాత సినిమాలను ఇప్పుడు ప్రదర్శిస్తే.. చాలా వాటికి క్లారిటీ తక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ సినిమాలను నేరుగా రీ రిలీజ్ చేస్తే.. క్లారిటీ స్పష్టంగా లేక.. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు తక్కువ ఆసక్తి చూపిస్తారు. అదే వాటిని మంచి రిజల్యూషన్​ క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తే కాస్త ఆసక్తి పెరుగుతుంది. అందుకే 'రీళ్లు'లో సందడి చేసిన చిత్రాలను ఇప్పుడు '4కే'(4 k) టెక్నాలజీతో రీరిలీజ్ చేస్తూ కొత్త అనుభూతి పంచుతున్నారు.

స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి చిత్రాలను రీరిలీజ్​ చేస్తున్నారు. అవి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. 'బాబా', 'పోకిరి', 'జల్సా', 'తమ్ముడు', 'వర్షం', 'బిల్లా', 'చెన్నకేశవ రెడ్డి', 'ఆరెంజ్​​', 'సింహాద్రి'.. ఇలా పలు చిత్రాలు ఇప్పటికే రీరిలీజ్ అయి మంచి కలెక్షన్లను సాధిస్తూ బిజినెస్ చేస్తున్నాయి.

అయితే ఇలా రీరిలీజ్ చేయడం మంచి లాభదాయకంగా ఉంటుందని సూపర్ స్టార్ కృష్ణ సోదరడు ఆదిశేషగిరిరావు అన్నారు. ఓ నార్మల్ ఫిల్మ్​ రిజల్యూషన్​ను 4కేలో మార్చడానికి దాదాపు రూ.20లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. ఒరిజినల్ ప్రింట్​ను తక్కువ ధరకే పొందగలిగితే.. రీరిలీజ్​ పక్కాగా మంచి లభాదయకమైన బిజినెస్ అని అన్నారు.

Re Release trend 4K Cost
4కే ఖర్చు

ఈ నెల మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా 'మోసగాళ్లకు మోసగాడు' మూవీ రీ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కృష్ణ సోదరుడు '4కే' టెక్నాలజీతో సినిమా రిజల్యూషన్​ను పెంచి రిలీజ్​ చేస్తున్నారు. ట్రైలర్​ను కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఈ క్రమంలోనే 4కేకు మార్చడానికి అయ్యే ఖర్చు గురించి చెప్పారు.

రీ మాస్టరింగ్‌.. గతంలో సినిమాలను 'రీళ్ల' ద్వారా చిత్రీకరించేవారు. వాటిని ఇప్పటి థియేటర్లలో ప్రదర్శించటం చాలా కష్టం. అందుకు వాటిని ఇప్పటి సాంకేతికతకు తగ్గట్టు మార్చాలి. ఈ పద్ధతిలో రీల్‌కు సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ను.. స్కాన్‌ చేసి వాటి ఇమేజ్​, వీడియో, ఆడియో క్వాలిటీని పెంచాలి. అది ఇంకా హైక్వాలిటీలో ఉండాలంటే 4k విజువల్స్‌లోకి తీసుకురావాలి. ఈ ప్రకియనే రీ మాస్టరింగ్ అంటారు. అయితే కొన్ని సినిమాల రీళ్లు అరిగిపోయి, చిగిరిపోయే అవకాశాలు ఉంటాయి. దీంతో ఒరిజినల్‌ ఫార్మాట్‌లో చూసినా అవి స్పష్టంగా కనిపించవు. వాటిని అద్భుతంగా చూపించాలంటే.. 8k టెక్నాలజీని కూడా ఉపయోగించాలి. 4kతో పోలిస్తే దానికి రెండింతలు ఖర్చు అవుతుంది. ఇక ఆయా సినిమాల రీళ్ల పనితీరు ఆధారంగా.. రీ మాస్టరింగ్​కు రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు సయయం పడుతుందట. ఇందులో స్కానింగ్‌, గ్రేడింగ్‌, రీస్టోరేషన్‌.. అనే మూడు పద్ధతులుంటాయట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అశ్రునయనాల మధ్య నటుడు శరత్ బాబుకు అంతిమవీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.