Puneeth Rajkumar Bramhanandam Ali: గతేడాది గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను ఇప్పటికీ అభిమానులు, ప్రముఖులు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాజాగా ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, ఆలీ.. బెంగళూరులోని పునీత్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యుల్ని, పునీత్ అన్న రాఘవేంద్రరావు రాజ్‌కుమార్‌ను పరామర్శించారు. ఆయన మరణం పట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పునీత్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడం వల్ల పునీత్.. అక్టోబరు 29న తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులే కాకుండా పలువురు నటీనటులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. పునీత్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.



ఇదీ చూడండి: 'హరిహర వీరమల్లు' హైలైట్.. వెయ్యి మందితో పవన్‌కల్యాణ్ ఫైట్!