ETV Bharat / entertainment

This Week Release Movies : ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఒకే రోజు 5 సినిమాల రిలీజ్​.. - ఈ వారం ఓటీటీ రిలీజ్​లు

This Week Release telugu Movies : గతవారం స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఆయితే ఆ వారం కూడా సినీప్రియుల్ని అలరించేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటి? ఎప్పుడు రిలీజ్​ కానున్నాయో తెలుసుకుందాం.

This Week Release Movies
ఈ వారం సినిమాలు
author img

By

Published : Aug 14, 2023, 2:05 PM IST

This Week Release telugu Movies : సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్', మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' వంటి పెద్ద సినిమాలు గతవారం థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఈ వారం చిన్న సినిమాల హవా సాగనుంది. మరి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓటీటీ, థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్న సినిమాలేంటో చూద్దాం..

Prem Kumar : యువ హీరో సంతోష్‌ శోభన్‌ నటించిన తాజా సినిమా 'ప్రేమ్ కుమార్'. అభిషేక్​ మహర్షి ఈ సినిమాతో డైరెక్టర్​గా పరిచయం అవుతున్నారు. రాశిసింగ్, సాదినేని రుచిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై శివప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 18న థియేటర్లలో సందడి చేయనుంది.

Mr Pregnant : తెలుగు బిగ్​బాస్ కంటెస్టెంట్ సయ్యద్‌ సొహైల్‌ నటించిన చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్'. ఈ సినిమాలో సొహైల్​కు జంటగా రూపా కొడువయూర్‌ నటించింది. ప్రసవం కోసం అమ్మ పడే కష్టాన్ని తీసుకున్న ఓ నాన్న కథను.. దర్శకుడు శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో నటుడు అలీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా కూడా ఆగస్ట్ 18న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Jilebi : మల్లీశ్వరి డైరెక్టర్ కె. విజయభాస్కర్ తన కుమారుడు శ్రీ కమల్‌.. 'జిలేబి' సినిమాతో హీరోగా పరిచయం అవబోతున్నాడు. శ్రీ కమల్​కు జంటగా.. హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ నటించారు. ఈ సినిమాను కె. విజయభాస్కర్ తెరకెక్కించారు. దాదాపు చిత్రీకరణ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ కానుంది.

DD Returns Bhutala Bangla : తమిళ కమెడియన్ సంతానం లీడ్ రోల్​లో నటించిన ఈ సినిమాకు తమిళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆగస్ట్ 18న తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. కామెడీ, హర్రర్ జానర్​లో ఉండే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పింస్తుందని దర్శకుడు ఎస్‌.ప్రేమ్‌ ఆనంద్‌ ఆన్నారు.

Pizza 3 : పిజ్జా సిరీస్​లో వచ్చిన సినిమాలు ఇప్పటికే హిట్​టాక్ అందుకున్నాయి. ఈ సినిమా తమిళంలో డీసెంట్ హిట్​ అందుకొని.. తాజాగా తెలుగు ఆడియెన్స్​ను పలకరించడానికి వస్తోంది. హార్రర్ థ్రిల్లింగ్ జానర్​లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 18 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

ఓటీటీలో రానున్న సినిమాలు, వెబ్​ సిరీస్​లు ఇవే..

ఈటీవీ విన్

  • అన్నపూర్ణ స్టూడియో ఆగస్ట్ 15

నెట్​ఫ్లిక్స్​..

  • అన్​టోల్డ్ ఆల్​ ఆఫ్​ షేమ్​ హాలీవుడ్ ఆగస్ట్ 15
  • నో ఎస్కేప్ రూప్ హాలీవుడ్ ఆగస్ట్ 15
  • గన్స్ అండ్ గులాబ్స్ హిందీ వెబ్ సిరీస్ ఆగస్ట్ 18

అమెజాన్ ప్రైమ్..

  • హర్లాన్ కొబెన్స్​ షెల్టర్ వెబ్ సిరీస్ ఆగస్ట్ 18

జీ 5.

  • ఛత్రపతి హిందీ ఆగస్ట్ 15

జియో.

  • తాలీ హిందీ ఆగస్ట్ 15
  • ఫ సే ఫాంటసీ హిందీ ఆగస్ట్ 15

Adipurush OTT Release : ఓటీటీలోకి 'ఆదిపురుష్' వచ్చేసింది.. ఎందులో స్ట్రీమింగ్​ అవుతుందో తెలుసా?

ఒకే సినిమాలో 100కు పైగా కుక్కలు.. వాటి కష్టాలే స్టోరీ.. డైరెక్టర్​ పెద్ద సాహసమే చేశారుగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.