ETV Bharat / entertainment

ఈ హీరోలు రింగ్​లోకి దిగితే 'పంచ్' పడాల్సిందే! ​

కథానాయకుడు ప్రతినాయకుడిపై పంచ్‌ డైలాగ్స్‌ వేస్తే ప్రేక్షకులకు ఎంతటి మజా వస్తుందో.. బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగి ‘పంచ్‌’ విసిరితే అంతకుమించిన ‘కిక్‌’ వస్తుంది. ఇప్పటికే పలువురు హీరోలు ఆ జోష్‌ను నింపగా ఇప్పుడు వరుణ్‌తేజ్‌ సిద్ధమయ్యాడు. ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా ఆయన నటించిన ‘గని’ సినిమా ఏప్రిల్‌ 8న విడుదలకానుంది. ఈ సందర్భంగా తెరపైకొచ్చిన కొన్ని బాక్సింగ్‌ కథలను గుర్తుచేసుకుందాం..

author img

By

Published : Apr 5, 2022, 3:26 PM IST

boxing storyline
బాక్సింగ్​

మెగాప్రిన్స్ వరుణ్​ తేజ్​ హీరోగా బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కిన 'గని' సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సింగ్​ కథాంశంతో ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాలు.. బక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. పవన్​కల్యాణ్​, రవితేజతో పాటు చాలా మంది హీరోలు రింగ్‌లోకి దిగి ‘పంచ్‌’విసిరి.. ప్రేక్షకులను అలరించిన వారే. బాక్సింగ్ థీమ్​తో వచ్చిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.

దట్‌ ఈజ్‌ తమ్ముడు

బాక్సింగ్‌ సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చేది ‘తమ్ముడు’. అంతగా ఈ సినిమా ప్రభావం చూపింది. అన్నదమ్ముల (పవన్‌ కల్యాణ్‌, అచ్యుత్‌) అనుబంధం నేపథ్యంలో తెరకెక్కి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రమాదవశాత్తూ బాక్సింగ్‌కు అనర్హుడైన అన్న కలను నిజం చేసే తమ్ముడి కథ ఇది. సుబ్రహ్మణ్యం అలియాస్‌ సుబ్బు (సుభాష్‌) పాత్రలో ఓ వైపు నవ్వులు, మరోవైపు యాక్షన్‌తో పవన్‌ కల్యాణ్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ కోసం ఆయన చేసిన రియల్‌ స్టంట్స్‌, ‘లుక్‌ ఎట్‌ మై ఫేస్‌ ఇన్‌ ది మిర్రర్‌’ గీతం ఎందరిలోనో స్ఫూర్తినింపాయి. ఇప్పటికీ ఈ పాట వింటూ కసరత్తులు చేసేవారెందరో ఉన్నారు. ఈ చిత్రానికి అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తండ్రికి తగ్గ తనయుడు

రఘువీర్‌ (ప్రకాశ్‌రాజ్‌) కిక్‌ బాక్సింగ్‌లో ఛాంపియన్‌. ఒకానొక సమయంలో తన ప్రియ శిష్యుడు ఆనంద్‌ (సుబ్బరాజ్‌)ను ఛాంపియన్‌గా మార్చాలనుకుంటాడు. కానీ, కూతురు స్వప్నను మోసం చేశాడని తెలుసుకుని షాక్‌ అవుతాడు. అప్పుడు చందు (రవితేజ) రంగంలోకి దిగుతాడు. తనయుడు గొప్ప బాక్సర్‌ అని తెలుసుకున్న రఘువీర్‌ ఆ క్షణం ఉప్పొంగిపోతాడు. తన వారసుడు వచ్చాడని మురిసిపోతాడు. చదువుతుంటేనే ‘ట్విస్ట్‌ అదిరింది’ అని అనిపిస్తుంది కదూ. ఈ కథతో తెరకెక్కిందే ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. టైటిల్‌కు తగ్గట్టు అమ్మ (జయసుధ), నాన్న (ప్రకాశ్‌రాజ్‌), ఓ తమిళ అమ్మాయి (అసిన్‌) చుట్టూ కథ తిరుగుతుంది.

ఇరు దేశాల మధ్య..

మిగతా బాక్సింగ్‌ చిత్రాలతో పోలిస్తే ‘జై’ విభిన్నంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇండియా- పాక్‌ మధ్య యుద్ధంలా సాగే కథ ఇది. మిగతా సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్‌ ఉంటే ఇందులో దేశభక్తి కనిపిస్తుంది. భారతీయులను తక్కువ చేసి మాట్లాడిన పాక్ ఛాంపియన్‌ను బాక్సింగ్‌ బరిలో మట్టికరిపించిన ఓ యువకుడి ప్రయాణమిది. నవదీప్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు తేజ దర్శకుడు. నవదీప్‌ నటించిన తొలి చిత్రమిదే. తేజ దర్శకత్వం వహించారు.

గురువు అంటే ఇలా..

మాధవన్‌ హీరోగా బాక్సింగ్‌ నేపథ్యంలో వచ్చిన తమిళ చిత్రం సాలా ఖడూస్‌’. సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఇదే సినిమా ‘గురు’ పేరుతో తెలుగులో రీమేక్‌ అయింది. వెంకటేశ్‌ హీరోగా రితికా సింగ్‌ కీలక పాత్రలో తెరకెక్కింది. బాక్సింగ్‌ అసోసియేషన్‌ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటూనే.. పేదింటి అమ్మాయి (రితికా) ప్రతిభను గుర్తించి, ఆమెను ఛాంపియన్‌గా మార్చే ఓ కోచ్‌ కథ ఇది. టాలెంట్‌కు డబ్బుతో పనిలేదని రితికా పాత్ర నిరూపిస్తే ‘గురువు అంటే ఇలా ఉండాలి’ అని వెంకటేశ్‌ పాత్ర అందరితోనూ అనిపించింది.

పరంపర కొనసాగిస్తూ..

పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన బాక్సింగ్‌ కథా చిత్రం ‘సార్‌పట్ట: పరంబరై’. (తెలుగులో ‘సార్‌పట్ట: పరంపర’). నేరుగా ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇందులో.. తమ సరదా కోసం ఆంగ్లేయులు భారతీయులకు బాక్సింగ్‌ నేర్పించడం, అది కొందరి కుటుంబాల్లో వంశపారంపర్యం అవడం అనే అంశాలు కొత్తగా అనిపిస్తాయి. అందుకే ‘సార్‌పట్ట’ విభిన్నమని చెప్పొచ్చు. చెన్నై నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్య ప్రధాన పాత్ర పోషించారు. హార్బర్‌ కూలీ.. బాక్సింగ్‌పై ఉన్న ప్రేమతో ‘సార్‌పట్ట’ టీమ్‌ను ఎలా గెలిపించాడు? అనేది కథాంశం. ఆర్య పోషించిన సుమరన్‌ పాత్రతోపాటు సినిమాలోని ప్రతి పాత్రా ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంది. ఈ సినిమాకి పా. రంజిత్‌ దర్శకుడు.

తుఫాన్‌లా చెలరేగి..

అజ్జు భాయ్‌ అలియాస్‌ అజీజ్‌ అలీ (ఫరాన్‌ అక్తర్‌) ముంబయిలోని డోంగ్రీలో స్ట్రీట్‌ ఫైటర్‌. చాలా మొండివాడు. ఏదైనా అనుకుంటే జరిగిపోవాల్సిందే! అలాంటి అజ్జు... బాక్సింగ్‌ బరిలోకి దిగి, తన సత్తా చాటాలని అనుకుంటాడు. మొండితనంతో నేర్చుకున్న బాక్సింగ్‌ కంటే టెక్నిక్‌తో నేర్చుకున్న బాక్సింగ్‌ గొప్పతనం తెలుసుకొని, బాక్సింగ్‌ గురువు నానా ప్రభు (పరేశ్‌ రావల్‌) దగ్గర చేరి శిష్యరికం చేసి మెరికలా తయారవుతాడు. ఇదీ ‘తుఫాన్‌’ చిత్ర కథ. ఫరాన్‌ అక్తర్‌ హీరోగా రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ తెరకెక్కించారు.

బాబాయి స్ఫూర్తితో అబ్బాయి

టైటిల్‌ సాంగ్‌, టీజర్‌, ట్రైలర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది ‘గని’ చిత్రం. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కించిన ఈ సినిమాలో వరుణ్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడు. పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రముఖ బాక్సర్‌ టోనీ జెఫ్రీస్‌ దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమలో సయీ మంజ్రేకర్‌ కథానాయిక. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. తన బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ ‘తమ్ముడు’ చిత్రం స్ఫూర్తితోనే ‘గని’ని చేశానని వరుణ్‌తేజ్‌ తెలిపారు.

బాక్సర్‌ భైరవ్‌

‘ఈ నగరానికి ఏమైంది’ ఫేం సాయి సుశాంత్‌ రెడ్డి హీరోగా బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. రోహిత్‌ తంజావూర్‌ దర్శకుడు. ఈ సినిమాలో సాయి.. భైరవ్‌ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సమర్పిస్తున్నాడు. గతేడాది విడుదలైన గ్లింప్స్‌ మినహా ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

ఇవి ఇలా..

కిక్‌ బాక్సింగే కాకుండా మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యమున్న కథలూ తెరపైకొచ్చాయి. కొన్ని రాబోతున్నాయి. పవన్‌ కల్యాణ్‌ ‘జానీ’, మంచు విష్ణు ‘డైనమైట్‌’ తదితర సినిమాలు ఆకట్టుకోగా త్వరలోనే ‘లైగర్‌’ సందడి చేయబోతుంది. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రంలో ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.