ETV Bharat / entertainment

'వారియర్ అప్పుడు విడుదలైతే.. నిక్కీతో పెళ్లయ్యేదే కాదు'

Adi pinnishetty The warrior movie: కథానాయకుడు, ప్రతినాయకుడి పాత్రలకే కాకుండా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన కోరిక అని కథానాయకుడు ఆది పినిశెట్టి అన్నారు. పెళ్లికి ముందు ది వారియర్ సినిమా విడుదలైతే హీరోయిన్​ నిక్కీ తనను పెళ్లి చేసుకునేది కాదని పేర్కొన్నారు.

adhi pinnishetty nikki tamboli
ఆదిపిన్నిశెట్టి నిక్కీతంబోలి
author img

By

Published : Jul 15, 2022, 5:23 PM IST

ఆది పిన్నిశెట్టి

Adi pinnishetty The warrior movie: పెళ్లికి ముందు ది వారియర్ సినిమా విడుదలైతే హీరోయిన్​ నిక్కీ తనను పెళ్లి చేసుకునేది కాదని యువ కథానాయకుడు ఆది పిన్నిశెట్టి చమత్కరించారు. ఆ చిత్రం పెళ్లి తర్వాత విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. రామ్ పోతినేని కథానాయకుడిగా ఆది ప్రతినాయకుడిగా నటించిన ది వారియర్ బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది. రామ్​తో పాటు గురు పాత్రలో నటించిన ఆదిపిన్నిశెట్టి విమర్శకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆది.... కథానాయకుడు, ప్రతినాయకుడి పాత్రలకే కాకుండా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఈ విషయంలో తనకు కమలహాసన్ చెప్పే మాటలు స్ఫూర్తిగా నిలుస్తాయంటోన్న ఆది... ది వారియర్ చూసి తన శ్రీమతి నిక్కీతోపాటు తండ్రి రవిరాజా పిన్నిశెట్టి ఎంతో హర్షం వ్యక్తం చేశారని తెలిపారు.

"అజ్ఞాతవాసి తర్వాతా చాలా సినిమాలో విలన్​ రోల్స్​ వచ్చాయి. సరైనోడు తర్వాత చేసే ప్రతినాయకుడి పాత్ర చాలా బాగుండాలని భావించాను. చాలా కథలను విన్నాను. ది వారియర్​ బాగా నచ్చింది. ఈ పాత్రను బాగా తీర్చిదిద్దారు. సినిమా చూసి నా రోల్​కు సంబంధించి కొన్ని సీన్స్​లో మరింత బాగా నటించొచ్చని మా నాన్నగారు అన్నారు. కథానాయకుడు, ప్రతినాయకుడి పాత్రలకే కాకుండా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. ఈ విషయంలో కమల్​హాసన్​ నాకు స్ఫూర్తి. హీరో రామ్ మంచి మనసున్న వ్యక్తి. ఓ నటుడిగా అతడు బాగా యాక్టింగ్​ చేయగలడు. ఓవర్​గా చేయడు. మరో రెండు కొత్త సినిమాలకు గ్రీన్​సిగ్నల్​ ఇవ్వబోతున్నాను" అని ఆది పేర్కొన్నారు.

ఇద చూడండి: సల్మాన్​ అలా అడిగితే నో చెప్పలేను: పాక్​ నటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.