ETV Bharat / entertainment

విజయ్‌-లోకేశ్‌ కనగరాజ్‌ మూవీ షురూ.. సినిమాలో సూర్య 'రోలెక్స్​' క్యారెక్టర్​​! - lokesh kanagaraj thalapathy vijay new movie

ప్రముఖ తమిళ నటుడు దళపతి విజయ్​ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను హిట్​ దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో హల్​చల్​ చేస్తోంది.

thalapathy67 movie
thalapathy67 movie
author img

By

Published : Dec 5, 2022, 8:34 PM IST

ప్రముఖ తమిళ నటుడు విజయ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. లోకేశ్​ కనగరాజ్​ యూనివర్స్​(LCU)లో భాగంగా ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ తెరకెక్కిస్తున్నారు. 'విక్రమ్'​ సినిమాతో సంచలన విజయం అందుకున్న లోకేశ్.. ఇప్పుడు విజయ్​ను డైరెక్ట్​ చేయబోతున్నారు. 'దళపతి ​67' అనే వర్కింగ్​ టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రేజీ కాంబినేషన్​లో వస్తున్న మూవీ గురించి ఓ వార్త నెట్టింట్లో హల్​చల్​ చేస్తోంది.

లోకేశ్ తెరకెక్కించిన పాత చిత్రాల్లో ఉన్న క్యారెక్టర్లను.. తన ఎల్​సీయూ చిత్రాల్లో ఆయన వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో కూడా హిట్​ క్యారెక్టర్లను పెట్టబోతున్నట్టు సమాచారం. 'విక్రమ్​' సినిమా చివర్లో 'రోలెక్స్'​ అనే పాత్రలో సూర్యను పరిచయం చేశారు లోకేశ్​. అంతకముందు 'ఖైదీ' సినిమాలో 'ఢిల్లీ'గా కార్తీని పరిచయం చేశారు. అయితే ఈ పాత్రలు తన ఎల్​సీయూ సినిమాల్లో వాడుకునేటట్లు రాసుకున్నారట.

అందుకే వాటిని ఇప్పుడు విజయ్​ సినిమాకు వాడుకుంటారట. అయితే ఈ పాత్రలు వాడుకోవాలంటే రాజ్​ కమల్​ ప్రొడక్షన్స్​, ఎస్​ఆర్ ప్రభు నుంచి పర్మిషన్​ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్లు అనుమతిస్తే.. ఖైదీ, విక్రమ్​ సినిమాల కథను కలుపుతారా?. విజయ్​ నటించిన మాస్టర్​ స్టోరీని పొడగిస్తారా? లేక సరికొత్తగా క్రియేట్​ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.

'దళపతి 67' విషయానికొస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్​ దత్​ విలన్​గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళ నటుడు విశాల్, దర్శకుడు గౌతమ్ మీనన్, మాజీ క్రికెటర్ ఎమ్ఎస్​ ధోనీ ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. త్రిష ఫీమేల్​ లీడ్​లో నటిస్తున్నారు. ఖైదీ నటులు నరైన్​, అర్జున్​ దాస్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్​​ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇవీ చదవండి : గుడ్డూ భయ్యా ఎమోషనల్‌ పోస్ట్​.. 'మీర్జాపూర్‌ 3' అప్డేట్​.. దాన్ని మీరు నమ్మకపోవచ్చంటూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.