ETV Bharat / entertainment

వింటేజ్​ లుక్​లో దళపతి విజయ్- 10 నిమిషాల కోసం రూ.6 కోట్లు ఖర్చు! - దళపతి 68 దర్శకుడు వెంకట్ ప్రభు

Thalapathy Vijay In Vintage Look : తమిళ హీరో దళపతి విజయ్ తన తదుపరి సినిమాలో వింటేజ్​ లుక్​లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో చిత్ర బృందం అత్యాధునిక సాంకేతికత వాడుతున్నట్లు సమాచారం. దీనికోసం దాదాపు రూ.6 కోట్లు ఖర్చు చేయనున్నారట. ఆ వివరాలు మీకోసం.

Thalapathy Vijay In Vintage Look
Thalapathy Vijay In Vintage Look
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 12:58 PM IST

Updated : Dec 10, 2023, 1:20 PM IST

Thalapathy Vijay In Vintage Look : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్​ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల 'లియో'తో సినీ అభిమానులను పలకరించిన ఈ హీరో ప్రస్తుతం 'దళపతి 68' అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న సినిమా​లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతికను వాడబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అందులో భాగంగా యూఎస్​లో విజయ్​ త్రీడీ వీఎఫ్​ఎక్స్​ స్కాన్​ కూడా తీశారు.

తాజాగా సమాచారం ప్రకారం కథలో భాగంగా విజయ్ దాదాపు 10 నిమిషాల పాటు వింటేజ్​ లుక్​లో కనిపించనున్నారు. ఇలా విజయ్​ వయసు తగ్గించడానికి చిత్ర బృందం డీ-ఏజింగ్​ టెక్నాలజీ వాడుతోందట. విదేశీ నిపుణుల సహాయంతో దాదాపు రూ.6 కోట్లు ఖర్చు చేసి విజయ్​ వయసు తగ్గించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటిదాకా తలపతి విజయ్ చేసిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కొత్తగా ఉండబోతుందట. విజయ్​ యంగ్​ లుక్​లో కనిపించబోతున్నారని తెలియడం వల్ల ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు.

అయితే ఈ డీ-ఏజింజ్​ టెక్నాలజీ ఇంతకముందు బాలీవుడ్​లో షారుక్​ ఖాన్​ సినిమాలో వాడారు. 'ఫ్యాన్​' మూవీలో షారుక్​ వయసు తగ్గించారు. ఈ సినిమాలో షారుక్​లా ఉన్న గౌరవ్ అనే పాత్రకు ఈ డీ-ఏజింగ్ టెక్నిగ్​ వాడారు. ఇక హాలీవుడ్​లో గార్డియన్స్​ ఆఫ్​ గ్యాలక్సీ, సివిల్​ వార్, డెడ్​ మెన్ టెల్ నో టేల్స్​, యాంట్​ మ్యాన్​ వంటి తదితర సినిమాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించారు.

Thalapathy 68 Cast : ప్రస్తుతం ఈ 'దళపతి 68' షూటింగ్​ హైదరాబాద్​లో జరుగుతోంది. మరో షెడ్యూల్​ కోసం త్వరలో చిత్ర యూనిట్ ఇస్తాంబుల్​ బయలుదేరనుంది. 'దళపతి 68'లో విజయ్​తో పాటు మీనాక్షి చౌదరి లీడ్​ రోల్​లో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో సీనియర్​ హీరోయిన్స్​ లైలా, స్నేహ కూడా నటిస్తున్నారు. ప్రభుదేవా, ప్రశాంత్, యోగి బాబు, అజ్మల్ జయరాం, యుగేంద్రన్, వైభవ్, ప్రేమ్​జీ, అరవింద్ ఆకాశ్​ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు.

లావణ్య ప్లేస్​లో ఆ బాలీవుడ్ హీరోయిన్​ - 'మాయ' చేసేందుకు ఆకాంక్ష రెడీ

పాన్ మసాలా యాడ్​లో ఆ ముగ్గురు స్టార్స్ - షాకిచ్చిన అలహాబాద్​ హైకోర్టు

Last Updated : Dec 10, 2023, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.